Actress Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి త్రిష ఒకరు. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ ఈమెకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి .ప్రస్తుతం త్రిష తమిళంలోనూ అలాగే తెలుగులో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల విషయం పక్కన పెడితే త్రిష తన వ్యక్తిగత విషయాల ద్వారా ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. త్రిష(Trisha) నటుడు విజయ్ (Vijay)రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా ఈమె రిలేషన్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా వీరిద్దరి గురించి రూమర్లు వస్తున్న నేపథ్యంలో విజయ్ భార్య సంగీత కూడా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో వీరి మధ్య కొనసాగుతున్న రిలేషన్ నిజమేనని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిష సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన ఆ పోస్ట్ విజయ్ తో రిలేషన్ కి ముడి పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా త్రిష తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేస్తూ.. మే (మీ) సీజన్ అధికారకంగా ప్రారంభమైందని ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ విధంగా ఈమె మీ సీజన్ అధికారకంగా ప్రారంభమైంది అంటూ చెప్పడంతో త్రిష పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? మీ సీజన్ అధికారకంగా ప్రారంభమైంది అంటే విజయ్ తో తన రిలేషన్ అఫీషియల్ గా ప్రారంభించబోతున్నారా? అంటూ కొంత మంది కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం మే నెల4 న త్రిష పుట్టినరోజు కావడంతో ఇలాంటి పోస్ట్ చేశారని భావిస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం మే 4 వ తేదీ తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ ఎన్నికలలో కచ్చితంగా విజయ్ గెలుస్తాడన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారా అంటూ ఎంతోమంది ఈ పోస్ట్పై ఎన్నో విధాలుగా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా త్రిష సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ పెట్టిన క్షణాలలో వైరల్ అవుతుంది. ఇక ఈమె వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి వృత్తిపరమైన విషయానికి వస్తే.. హీరో సూర్యతో కలిసి కరుప్పు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మే 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా తెలుగులో కూడా వీరభద్రుడు అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర అనే సినిమా ద్వారా కూడా త్రిష తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా త్రిష కెరియర్ పరంగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: నా పెళ్ళాం నిప్పు రా.. వైరల్ అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్!