E-Paper
Advertisement

హీరో సూపర్ స్ప్లెండర్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు మర్చిపోకండి!

హీరో సూపర్ స్ప్లెండర్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు మర్చిపోకండి!
Advertisement

Hero Super Splendor Buying Guide:  హీరో సూపర్ స్ప్లెండర్  భారత్ లో అత్యంత నమ్మకమైన కమ్యూటర్ బైక్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు XTEC వెర్షన్ ద్వారా అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. ఒకవేళ మీరు ఈ బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే..

⦿ మైలేజ్

ఈ బైక్‌ లో మైలేజీ పెద్ద ప్లస్ పాయింట్. లీటర్‌ కు సుమారు 68 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. రోజూ ఆఫీస్‌ కి వెళ్లేవారికి, ఊరి నుంచి పట్టణాలకు ప్రయాణించే వారికి ఈ బైక్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉండటంతో తరచూ పెట్రోల్ నింపాల్సిన అవసరం ఉండదు. వాస్తవ మైలేజీ డ్రైవింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

⦿ ఇంజిన్

Advertisement

ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైక్‌ లో 124.7cc సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారు 10.7 bhp పవర్, 10.6 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌ బాక్స్ ఉంటుంది. చాలా 125cc బైక్‌లలో ఇంకా 4 స్పీడ్ గేర్‌ బాక్స్ ఉండగా, ఇందులో అదనపు గేర్ ఉండటం వల్ల రైడింగ్ మరింత స్మూత్‌ గా ఉంటుంది. ఈ ఇంజన్ ఎక్కువ స్పీడ్ కోసం కాకుండా, రోజువారీ వినియోగానికి సౌకర్యంగా ఉండేలా ట్యూన్ చేయబడింది.

⦿ ఫీచర్లు

ఈ బైక్‌లో ఫీచర్లు కూడా బాగానే ఉన్నాయి. XTEC వేరియంట్‌ లో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో రియల్ టైమ్ మైలేజీ, స్పీడ్ లాంటి వివరాలు ఈజీగా కనిపిస్తాయి. అలాగే, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్, SMS అలర్ట్స్ తెలుసుకోవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇవి పెద్దగా లగ్జరీ ఫీచర్లు కాకపోయినా, రోజువారీ ప్రయాణంలో ఉపయోగపడతాయి.

⦿ సేఫ్టీ, సౌకర్యం

Advertisement

సేఫ్టీ, సౌకర్యం విషయంలో కూడా ఈ బైక్ ముందుంటుంది. i3S స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ట్రాఫిక్‌ లో ఇంధనాన్ని ఆదా చేయడంలో సాయపడుతుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉండటం వల్ల బైక్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు.  LED హెడ్‌ ల్యాంప్ రాత్రి సమయంలో మంచి విజిబిలిటీ ఇస్తుంది.

⦿ ధర, వేరియంట్లు

ధర, వేరియంట్ల విషయానికి వస్తే, ఈ బైక్ డ్రమ్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లలో లభిస్తుంది. ధరల మధ్య పెద్ద తేడా ఉండదు. అయితే సిటీ ట్రాఫిక్‌లో మంచి బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకోవడం మంచిది. సేఫ్టీ పరంగా మెరుగ్గా ఉంటుంది. మంచి మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, అవసరమయ్యే ఫీచర్లతో  రోజువారీ ప్రయాణాలకు సరైన ఆప్షన్ గా ఉంటుంది.  మీ అవసరాలను బట్టి సరైన వేరియంట్‌ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది.

Read Also: 3 సెకన్లలో 40 స్పీడ్.. ఏముంది భయ్యా ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×