E-Paper
Advertisement

Vijay – Sangeetha: ఇదెక్కడి ట్విస్ట్.. విజయ్ కోసం రాజకీయ ప్రచారానికి సంగీత!

Vijay – Sangeetha: ఇదెక్కడి ట్విస్ట్.. విజయ్ కోసం రాజకీయ ప్రచారానికి సంగీత!
Advertisement

Vijay – Sangeetha:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) అతి తక్కువ సమయంలోనే ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఒకవైపు తమిళ్ చిత్రాలలో నటిస్తూనే.. వాటిని తెలుగులో డబ్బింగ్ చేస్తూ అలాగే నేరుగా తెలుగు చిత్రాలలో కూడా నటిస్తూ సౌత్ ఇండియాలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ అటు వృత్తిపరమైన ఇటు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన చివరి సినిమాగా వచ్చిన ‘జన నాయగన్ ‘ విడుదలకు నోచుకోక ఇబ్బందులు పడుతుంటే ..మరొకవైపు ఆయన భార్య సంగీత విడాకులు కోరడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

విజయ్ పై అభియోగాలు మోపుతూ విడాకుల కోరిన సంగీత..

ముఖ్యంగా విజయ్ పై ఏడు అభియోగాలు మోపుతూ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది . ఏప్రిల్ 20వ తేదీన విజయ్ విచారణకు రావాలి అని కోర్ట్ ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా ఒక సినీ నటితో విజయ్ కి ఉన్న సంబంధం కారణంగానే తాను విడాకులు కోరుతున్నానని సంగీత తన పిటీషన్ లో కోరినట్లు తెలుస్తోంది.. ఇక ఇలా ఒకవైపు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సడన్ ట్విస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..

హీటెక్కిన తమిళనాడు రాజకీయాలు..

Advertisement

విషయంలోకి వెళ్తే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా హీటెక్కాయి. నటుడు విజయ్ పార్టీ.. అధికార పార్టీకి సవాలు విసురుతూ ఎదుగుతున్న వేళ అటు ఆయన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన అలజడులు.. వాటిని సర్దుబాటు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

సంగీత మనసు మార్చే ప్రయత్నం..

ఇలాంటి సమయంలో విజయ్ ను రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు చేస్తూ ఆయన కుటుంబమే రంగంలోకి దిగుతోంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధమంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ – సంగీత మధ్య ఉన్న ఈ విభేదాలను పరిష్కరించేందుకు విజయ్ తండ్రి ప్రముఖ డైరెక్టర్ తండ్రి చంద్రశేఖర్, అలాగే తల్లి శోభ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. విజయ్ – సంగీతల కొడుకు జేసన్ సంజయ్ , కుమార్తె దివ్యా షాషా కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జేసన్ సంజయ్ తన తల్లి పక్క ఉన్నప్పటికీ.. కుటుంబం ఒకటిగా ఉండాలని పట్టుబడుతున్నారట.

Advertisement

ALSO READ:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ వెనుక ఇంత స్టోరీ ఉందా?

విజయ్ కోసం సంగీత రాజకీయ ప్రచారం..

అందులో భాగంగానే పిల్లల పట్ల ఉన్న ప్రేమ.. పెద్దల సూచనల మేరకు విజయ్ పై ఉన్న కోపాన్ని పక్కనపెట్టి సంగీత తన నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె తిరిగి మళ్లీ విజయ్ తో కలిసే అవకాశం ఉందని.. ఫలితంగా టీవీకే ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఏది ఏమైనా విడాకుల వేళ సంగీత వేదిక పైకి వచ్చి విజయ్ కోసం ఓట్లు అభ్యర్థిస్తే మాత్రం అది విజయ్ కి ఊహించని ఇమేజ్ ను ఇస్తుంది అనడంలో సందేహం లేదు. వ్యక్తిగత సమస్యలను సాకుగా చూపి రాజకీయం చేయాలనుకున్న ప్రతిపక్షాలకు సంగీత చెక్ పెట్టాలని అటు అభిమానులు , కుటుంబ సభ్యులు గట్టిగా కోరుతున్నార ఇక సంగీత తన మనసు మార్చుకొని విజయ్ కోసం రంగంలోకి దిగుతుందేమో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×