E-Paper
Advertisement

Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్.. ఇదీ అసలు మ్యాటర్!

Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్.. ఇదీ అసలు మ్యాటర్!
Advertisement

Traffic Challans Discount:  తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో గత కొద్ది రోజులు ప్రచారం జరుగుతుంది. మార్చి 14న నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ అంటూ కొన్ని వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది వాహనదారులు ఈ వార్తల గురించి ఆరా తీస్తున్నారు. డిస్కౌంట్ తో చలానాలు ఎలా చెల్లించాలని ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై హైదాబాద్ పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

చలాన్ల డిస్కౌంట్ పై స్పందించిన పోలీసులు

సోషల్ మీడియా ప్రచారంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని వెల్లడించారు. 80% మాఫీ వార్తలు అవాస్తవమని ప్రకటించారు. సోషల్ మీడియాలో డిస్కౌంట్ గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్ అన్నారు. రూ.2000 చలాన్లు ఉంటే రూ.400తో క్లియర్ అవుతాయన్న ప్రచారం నిజం కాదని చెప్పారు. అధికారిక సమాచారం కోసం పోలీస్ శాఖ అధికారిక పేజీలను మాత్రమే నమ్మాలని వాహనదారులకు సూచించారు.

తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు

Advertisement

సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలను నమ్మకూడని హైదరాబాద్ పోలీసులు సూచించారు. తప్పుడు ప్రచారాలకు సంబంధించిన వీడియోలను షేర్ కూడా చేయకూడదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియోలు, పోస్టులు పెట్టకూడదన్నారు. ఒకవేళ అలాంటి వీడియోలు ఎవరైన షేర్ చేస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాను పోలీసు బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారికి కఠిన శిక్ష తప్పదన్నారు.

Read Also: ప్రయాణీకులకు కాస్త రిలీఫ్, దుబాయ్ నుంచి ఇండియాకు విమాన సర్వీసులు ప్రారంభం!

అధికారిక సమాచారన్ని తెలుసుకోండి!

Advertisement

సోషల్ మీడియాలో వచ్చే వార్తల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ ఫేక్ ప్రచారాలను గమనించినట్లు అయితే, వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఒకవేళ అధికారిక ధృవీకరణ కావాలనుకున్నా పోలీసు వెబ్ సైట్ లేదంటే, అధికారికి సోషల్ మీడియా పేజీలను చూడాలని సూచించారు. తప్పుడు వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ చేయకూడదన్నారు.

Read Also: పైలట్లు రొయ్యలు, పీతలు ఎందుకు తినరు? వారి క్యాప్‌ లో ఫొటోలు ఎందుకు పెట్టుకుంటారు?

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×