E-Paper
Advertisement

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?
Advertisement

Legacy Movie:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడబోతుందా అంటే అవుననే వినిపిస్తుంది.క్రేజీ స్టోరీస్ తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విశ్వక్, ఈసారి ‘లెగసీ’ అనే పొలిటికల్ యాక్షన్ డ్రామాతో థియేటర్లలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.

ఇప్పటివరకు లవ్, క్రైమ్, ఫాంటసీ, థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించిన విశ్వక్ సేన్, ఫస్ట్ టైమ్ పక్కా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ లెంత్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ క్యూరియాసిటీ కనిపిస్తుంది.

Advertisement

డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా

. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్ . అవును ..ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుఅఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. విశ్వక్ సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్‌లతో ఉన్న సరికొత్త రిలీజ్ డేట్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది కూడా.

Advertisement

సాయికిరణ్ రెడ్డి దైడా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుబాటి, సాయికిరణ్ కలిసి చాలా రిచ్‌గా నిర్మిస్తున్నారు. పవర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ అండ్ వినాశకరమైన నమ్మకద్రోహం చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇన్ సేడ్ టాక్ .

ఒక ఆర్డినరీ మ్యాన్ పొలిటికల్ గొడవల మధ్యలోకి అడుగుపెట్టి అక్కడ ఉన్న పెద్ద పెద్ద శక్తులతో ఎలా ఫైట్ చేశాడనే పాయింట్‌ను డైరెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారట మేకర్స్ .

96′ ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ కే కే మీనన్ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తుండటం విశేషం. విశ్వక్ సేన్, కే కే మీనన్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్ లాంటి సీనియర్ నటులు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తుండటంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ’96’ ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్, బీజీఎమ్ ఈ పొలిటికల్ థ్రిల్లర్‌కు మెయిన్ ఎసెట్ అని చెప్పక్కర్లేదు.

ఇక మాములుగా చూస్తే డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద రేసు ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పక్కర్లేదు .. ఇయర్ ఎండ్, క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేస్తూ పెద్ద సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. గతంలో డిసెంబర్ నెలలోనే వచ్చిన పుష్ప, సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించాయో అందరికీ తెలిసిందే.

లెగసీ’తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్

ఇప్పుడు అదే బాటలో డిసెంబర్ 4న రాబోతున్న ‘లెగసీ’ కూడా మాస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్ .విశ్వక్ సేన్ తన ప్రీవియస్ మూవీస్ ‘ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో రిజల్ట్ ని పక్కన పెడితే తన పెర్ఫార్మెన్స్‌తో మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్నాడు. అదే జోష్‌తో ఇప్పుడు ‘లెగసీ’తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్టే కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను చాలా స్పీడ్‌గా జరుపుకుంటోందని వినిపిస్తుంది . షూటింగ్ దాదాపు ఎండ్‌కి రావడంతో త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయనున్నారట .. సో త్వరలోనే టీజర్, ట్రైలర్ అండ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయన్న మాట.

Also read :మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

చూడాలి మరి డిసెంబర్ 4న థియేటర్లలో ‘లెగసీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !

Tags

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×