E-Paper
Advertisement

Ram Pothineni : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం

Ram Pothineni : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం
Advertisement

Ram Pothineni : షార్ట్ ఫిలిం తో తన కెరియర్ మొదలుపెట్టి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్. భారీ సినిమాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సినిమాకి వెంటనే పాజిటివ్ టాక్ రాలేదు కానీ మూడు వారాలు పోయిన తర్వాత మౌత్ టాకుతో ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు.

ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా పడలేదు. ఆ సినిమా తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఊహించిన సక్సెస్ రాలేదు. ప్రస్తుతం రామ్ మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధిస్తుంది. అని చాలామంది బలంగా నమ్ముతున్నారు.

రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని 

Advertisement

రీసెంట్ గా చాలామంది స్టార్ హీరోలు తమ ముందు ఉన్న టాగ్స్ ను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాకి సంబంధించి తన ముందు గ్లోబల్ స్టార్ అనే టాగ్ తీసేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని మాత్రమే పెట్టుకున్నారు.

మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాకి ఉస్తాద్ రామ్ పోతినేని అని ట్యాగ్ కూడా వేయలేదు. ఎనర్జిటిక్ హీరో రామ్ అని వేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఉస్తాద్ అనే ట్యాగ్ రామ్ కి వచ్చింది. ఇక రామ్ చరణ్ మాదిరిగానే రామ్ పోతినేని కూడా ఆ ట్యాగ్ తొలగించుకున్నాడు.

మిగతా హీరోలు కూడా చేస్తారా? 

Advertisement

కేవలం ఈ ఇద్దరు హీరోలకు మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది తెలుగు హీరోలకి ఈ రకమైన ట్యాగ్ లు ఉన్నాయి. వాళ్లు కూడా వీళ్లను ఆదర్శంగా తీసుకొని చేంజెస్ చేస్తారా.?లేకుంటే వాటినే కంటిన్యూ చేస్తారా? అనే క్యూరియాసిటీ కూడా చాలామందిలో ఉంది.

రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఒక స్టార్ హీరోకి మరియు అభిమానికి ఉన్న బాండింగ్ గురించి సినిమాలో చూపిస్తారు అని చాలామంది ఊహిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ టీజర్ లో డైలాగులు కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో త్వరలో తెలుస్తుంది.

Also Read: Bandla Ganesh: ఒక్క సినిమా హిట్టు కొడితే, అలా బిహేవ్ చేస్తారు, బండ్ల కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×