Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 మొదలై దాదాపు రెండు నెలలు అయిపోతుంది. అయితే ఎవరి రంగులు కూడా పూర్తిగా బయటపడలేదు. బంధాలు బంధుత్వాలు తో ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చారు. ఆ బంధాల కారణంగానే భరణి బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికీ కూడా బిగ్ బాస్ 9 లో ఆసక్తికరంగా అనిపించేది నామినేషన్స్. నామినేషన్స్ ప్రక్రియ జరిగినప్పుడు ఒక్కొక్కరివి అసలు రంగులు బయటపడతాయి.
వాళ్లకు ఎంత కోపం ఉంది, వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు. ఎవరి గురించి ఏమి అనుకుంటున్నారు అనే అంశాలన్నీ కూడా ఆరోజు బయటపడతాయి. ఇక ప్రస్తుతం ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. చాలామంది తనుజ మీద ఉన్న ఒరిజినల్ ఫీలింగ్ ఇప్పుడు బయట పెడుతున్నారు.
బిగ్ బాస్ 9 లో మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది తనుజ. తను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ఈమె అన్నపూర్ణ ప్రోడక్ట్ అని ఏకంగా నాగార్జున చెప్పారు. అది ఏ ఉద్దేశంతో చెప్పారో అప్పుడు చాలామందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రత్యేకంగా ఆవిడని సపోర్ట్ చేస్తున్నారు అని ఈజీగా అర్థమయిపోతుంది.
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బెడ్ టాస్క్ గురించి విపరీతమైన ఆర్గ్యుమెంట్ ఇమ్మానుయేల్ మరియు తనుజ మధ్య నడిచింది. తనుజ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అని ఇమ్మానుయేల్ చెప్పాడు. చాలామంది సపోర్ట్ తీసుకుంటున్నావు నువ్వు నేను కాదు అంటూ తనుజ రివర్స్ లో మాట్లాడింది.
బెడ్ టాస్క్ లో మా సపోర్టు ఉంది కాబట్టి నువ్వు ఆ రోజు గెలిచావ్ నువ్వు ఆరోజు బెడ్ టాస్క్ లో ఆడిందేమీ లేదు చీర కట్టుకొని వచ్చి కేవలం పెళ్ళికూతుర్ల చాలా హ్యాపీగా కూర్చున్నావు నేను భరణి గారు సపోర్ట్ చేయడం బట్టే ఆరోజు బయటపడ్డావ్ అంటూ చెప్పాడు.
అయితే ఇప్పటివరకు తనుజ మీద పెద్దగా ఎవరూ అరిచిన దాఖలాలు లేవు. అలా అరిచిన రమ్య మోక్షను బిగ్ బాస్ యాజమాన్యం సక్సెస్ఫుల్ గా బయటకు పంపించేసింది. రమ్య మోక్ష హౌస్ లో తనకి జరిగిన అన్యాయాన్ని కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తూ బయటపెట్టింది.
ఇక కేవలం ఇమ్మానుయేలు మాత్రమే కాకుండా భరణి కూడా తనుజను నామినేట్ చేస్తూ, ఒకసారి బయటికి వెళ్లి వస్తే అసలు ఏం జరుగుతుందో అర్థం అవుతుంది అని భరణి తనుజ మొహం మీద చెప్పేశాడు. ఎప్పుడూ నాన్న నాన్న అని పిలిచే తనుజ తన పద్ధతి మార్చి భరణి గారు అని అనడం మొదలుపెట్టింది. ఇప్పుడిప్పుడే అసలైన గేమ్ మొదలైంది అని ఆడియన్స్ కి కూడా క్లారిటీ వచ్చింది.
Also Read: Andhra King Taluka : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం