E-Paper
Advertisement

Bandla Ganesh: ఒక్క సినిమా హిట్టు కొడితే, అలా బిహేవ్ చేస్తారు, బండ్ల కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

Bandla Ganesh: ఒక్క సినిమా హిట్టు కొడితే, అలా బిహేవ్ చేస్తారు, బండ్ల కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?
Advertisement

Bandla Ganesh: నటుడుగా కెరియర్ మొదలుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నిర్మాతగా మారారు. గణేష్ చేసిన అన్ని సినిమాల్లో కంటే గబ్బర్ సింగ్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ సినిమా విపరీతమైన లాభాలు తీసుకొచ్చింది. ఆ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్మార్ అనే సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ సినిమా సక్సెస్ సాధించలేదు కాబట్టే గబ్బర్ సింగ్ సినిమాకి అవకాశం ఇచ్చారు.

గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పుడే బండ్ల గణేష్ గురించి చాలామందికి ఒక రకమైన క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత కాలంలో బండ్ల గణేష్ స్పీచ్ లు వైరల్ గా మారాయి. బండ్ల గణేష్ స్పీచెస్ కోసం ఆడియో లాంచ్ లకి వచ్చే ఆడియన్స్ కూడా ఒక టైం లో ఏర్పడ్డారు. ఇక తాజాగా బండ్ల గణేష్ కిరణ్ అబ్బవరం నటించిన K -Ramp సినిమా సక్సెస్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలు ఎవరి గురించి 

Advertisement

ఏ సినిమా సక్సెస్ ఈవెంట్ కు హాజరైన కూడా వాళ్ల గురించి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడంతో పాటు బీభత్సమైన ఎలివేషన్ కూడా ఇస్తుంటాడు గణేష్. లిటిల్ హార్ట్స్ సినిమా అప్పుడు కూడా మౌళి గురించి ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు నిజాలను కూడా ఓపెన్ గా చెప్పేసాడు.

ఇప్పుడు కిరణ్ అబ్బవరం గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడారు. ఈ కాలంలో ఒక హీరో సూపర్ హిట్ కొట్టగానే నాకు ఆ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ సెట్ చేయండి.ఒక్క సినిమా హిట్టు కొడితే “లోకేష్ కనగరాజ్ ను తీసుకురా.. రాజమౌళిని తీసుకురా..సుకుమార్ ను తీసుకురా.. అనిల్ రావిపూడిని తీసుకురా” అంటున్న ఈ రోజుల్లో… మట్టిలో మాణిక్యాలను ఏరుకుని నిలబెడుతున్నాడు కిరణ్ అబ్బవరం.

Advertisement

ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్ తోనే చేశాడు అంటూ తన గురించి ఎలివేషన్ ఇచ్చాడు. వాస్తవానికి అది కూడా కరెక్ట్ అని ఒప్పుకొని తీరాల్సిందే.

అందరూ కొత్తవాళ్లే 

కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ప్రతి సినిమా కూడా కొత్త దర్శకుడికి అవకాశాలు ఇచ్చాడు. కొత్త దర్శకులు ఎప్పుడూ కూడా తమ సినిమాతో ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు. అందుకే కిరణ్ చాలా మందికి అవకాశాలు ఇచ్చాడు. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. కానీ కొన్ని సినిమాలతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన K -Ramp సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ రా సక్సెస్ సాధించింది.

Also Read: Rajesh Danda: అలా చేయకుండా ఉండాల్సింది, ప్రొడ్యూసర్ రిలైజేషన్

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×