Lokesh Kanagaraj : నేటి కాలంలో తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు కంటే కూడా ఇతర భాషల్లో వచ్చే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కంప్లైంట్స్ కూడా వినిపిస్తూనే ఉంటాయి. హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా మన సినిమాలు కంటే ఎక్కువగా వాళ్ళ సినిమాలనే ఆదరిస్తారు అని స్టేజ్ మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
ఒక సినిమా బాగుంది అంటే దానికి భాషతో సంబంధం లేకుండా చూడటం ఎప్పటినుంచో అలవాటు చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక తమిళి దర్శకుడు లోకేష్ కనగరాజ్ పైన కూడా అదే రేంజ్ లో కొంతమంది తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం ఉంది. అతని నుంచి చివరగా వచ్చిన కూలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
కూలీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమా కొంతవరకు ఆకట్టుకుంది కానీ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అనే వార్తలు కూడా వినిపిస్తుంటాయి. ఇప్పుడు సన్ పిక్చర్స్ లో లోకేష్ హీరోగా అరుణ్ దర్శకత్వంలో డిసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా కోసం ఏకంగా 35 కోట్లు లోకేష్ ఛార్జ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అదంతా కూడా అవాస్తవం అని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 25 కోట్లు మాత్రమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కూలీ సినిమా పోవడం వలనే కొంచెం తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను ప్లాన్ చేసే పనిలో ఉన్నారు.
అయితే ఈ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ మరియు అనిరుద్ సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే కూడా ఈ సినిమాకి తక్కువ తీసుకుంటున్నట్లు వినికిడి. వీరిద్దరూ కలిసి పనిచేసిన కూలీ సినిమాకు మంచి రెమ్యూనరేషన్ వచ్చింది. కానీ ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. బహుశా అందుకోసమే ఈ సినిమాకి సంబంధించి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని మరి పనిచేస్తున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళీ మంచి కం బ్యాక్ ఇచ్చినట్లే.
Also Read: Ram Pothineni: మీకు క్లాసులు పీకను గానీ లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి