E-Paper
Advertisement

Sharwanand : నన్ను జీవితంలో చాలా మంది మోసం చేశారు

Sharwanand : నన్ను జీవితంలో చాలా మంది మోసం చేశారు
Advertisement

Sharwanand : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన శర్వానంద్ తర్వాత కాలంలో హీరోగా కూడా సినిమాలు చేశారు. శర్వానంద్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అలానే ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.

సినిమాలు ఫెయిల్ అయిన కూడా ఆ సినిమా కోసం శర్వానంద్ పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం ఎప్పుడూ తక్కువ కాలేదు. గమ్యం ప్రస్థానం వంటి ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు తన కెరీర్ లో ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో శర్వానంద్ సక్సెస్ఫుల్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. ఒక సక్సెస్ఫుల్ సినిమా చేస్తే చూడాలని చాలామంది అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

బైకర్ తో ప్రేక్షకులు ముందుకు 

Advertisement

శర్వానంద్ చాలా కష్టపడి బైక్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం శర్వానంద్ చాలా కష్టపడ్డారు. దాదాపు 20 కేజీల బరువు కేవలం నాలుగు నెలల్లోనే తగ్గిపోయారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటాడు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక కాలేజ్ కు హాజరయ్యాడు శర్వానంద్. అక్కడ స్టూడెంట్స్ ని ఆకట్టుకునే ఆసక్తికర స్పీచ్ ఇచ్చాడు.

Advertisement

నేను ఈరోజు ఇక్కడికి గెస్ట్ గా రాలేదు ఒక అన్నయ్యగా వచ్చాను. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. నేను లైఫ్ లో చాలాసార్లు పడిపోయాను, చాలాసార్లు ఓడిపోయాను, చాలాసార్లు మోసపోయాను కూడా.

కానీ నేను పడిపోయిన ప్రతిసారి ఒకటి నేర్చుకున్నాను. ఏదో ఒకటి జీవితం నేర్పిస్తూనే ఉంది. మన కథను మనమే రాసుకోవాలి. నీకు ఎవడు చెప్పకూడదు నువ్వేం చేయాలి, అలానే నువ్వేం చేయలేవు అని. బుక్ నీది పెన్ను నీది స్టోరీ నీది ఇష్టం వచ్చినట్లు రాసుకోండి.

అదే శర్వానంద్ బెస్ట్ క్వాలిటీ 

శర్వానంద్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయినా కూడా శర్వానంద్ వ్యక్తిత్వం అంటే చాలా మందికి ఇష్టం. శర్వానంద్ గురించి కొన్ని సందర్భాల్లో దగ్గుబాటి రానా మరియు రామ్ చరణ్ కూడా చాలా మంచిగా మాట్లాడారు.

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ అనే షోలో శర్వానంద్ ఎంత మంచోడో రామ్ చరణ్ మాటల్లో చెప్తే చాలామందికి ఆశ్చర్యం కలిగింది. వారి మధ్య బాండింగ్ కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. శర్వానంద్ సినిమా వచ్చినప్పుడు రామ్ చరణ్ నిలబడిన తీరు కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదే కదా నిజమైన ఫ్రెండ్షిప్ అంటే అనిపిస్తుంది.

Also Read: Lokesh Kanagaraj : కూలీ పోవడమే, కూలీలుగా పని చేయాల్సి వస్తుందా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×