E-Paper
Advertisement

Lokesh Kanagaraj: హీరోగా మారిన ఖైదీ దర్శకుడు.. ‘డీసీ’ గ్లింప్స్ రిలీజ్!

Lokesh Kanagaraj: హీరోగా మారిన ఖైదీ దర్శకుడు.. ‘డీసీ’ గ్లింప్స్ రిలీజ్!
Advertisement

Lokesh Kanagaraj: బాక్సాఫీస్ వద్ద ఖైదీ, విక్రమ్ వంటి సినిమాలతో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, ఇప్పుడు మేకప్ వేసుకుని వెండితెరపై హీరోగా మెరవబోతున్నారు. దర్శకులు హీరోలుగా మారడం కొత్తేమీ కాకపోయినా, లోకేశ్ వంటి మాస్ డైరెక్టర్ తెరపై ఎలా కనిపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా విడుదలైన ‘డీసీ’ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ప్రేమికుల రోజున వాలంటైన్ రొమాన్స్‌కు బదులు ‘బ్లడీ’ వయొలెన్స్‌తో లోకేశ్ షాక్ ఇచ్చారు. వివరాలలోకి వెళితే..

రక్తపాతంతో కూడిన కొత్త ప్రేమకథ:

సాధారణంగా ప్రేమికుల రోజు అంటే గులాబీలు, గ్రీటింగ్ కార్డ్స్ కనిపిస్తాయి. కానీ లోకేశ్ కనగరాజ్ స్టైలే వేరు. ‘డీసీ’ గ్లింప్స్‌లో ఆయన ప్రేమ కంటే రక్తపాతాన్నే ఎక్కువగా చూపించారు. ఈ చిత్రంలో లోకేశ్ ‘దేవదాస్’ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ భామ వామికా గబ్బి ‘చంద్ర’గా కనిపిస్తోంది. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘DC’ అని టైటిల్ ఖరారు చేశారు. అయితే ఈ దేవదాస్ గడ్డం పెంచుకుని మందు తాగే రకం కాదు, కత్తులతో పీకలు కోసే రకమని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. చిన్న వీడియోలోనే అంత హింస ఉందంటే, ఇక పూర్తి సినిమాలో లోకేశ్ మార్క్ వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేస్తున్నారు.

డైరెక్టర్ లోకేశ్.. హీరోగా నెగ్గుతాడా?:

Advertisement

లోకేశ్ కనగరాజ్ ప్రతి సినిమాలోనూ ఒక రకమైన డార్క్‌నెస్, రానెస్ ఉంటుంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమాలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. దర్శకుడిగా ఉన్నప్పుడు నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టిన ఆయన, ఇప్పుడు కెమెరా ముందు తనలోని నటుడిని ఎలా ఆవిష్కరిస్తారనేది ఆసక్తికరం. వామికా గబ్బితో ఆయన కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది? అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్ లోకేశ్‌ను ఎలా ఎలివేట్ చేస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా ‘డీసీ’ గ్లింప్స్ మాత్రం టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ:Sita Payanam Movie review: హానెస్ట్ అటెంప్ట్.. కానీ, సెకండాఫ్‌ మాత్రం..

సమ్మర్ స్పెషల్ రిలీజ్:

Advertisement

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఖర్చు తో నిర్మిస్తోంది. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. లోకేశ్ సినిమాలకు ప్రాణం పోసే అనిరుధ్ రవిచందర్, ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. గ్లింప్స్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై హైప్ పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న లోకేశ్, హీరోగా కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×