E-Paper
Advertisement

Sita Payanam Movie review: హానెస్ట్ అటెంప్ట్.. కానీ, సెకండాఫ్‌ మాత్రం..

Sita Payanam Movie review: హానెస్ట్ అటెంప్ట్.. కానీ, సెకండాఫ్‌ మాత్రం..
Advertisement

Sita Payanam Movie review:యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో అతని కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘సీతా పయనం’. ట్రైలర్ తో ఈ సినిమాపై పాజిటివిటీ ఏర్పడింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ట్రైలర్ రేంజ్లో సినిమా ఆకట్టుకుందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథ :

సీత (ఐశ్వర్య అర్జున్) చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటుంది. దీంతో తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్య రాజ్) ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతాడు. తల్లి లేని లోటు తెలీకూడదు అని తాపత్రయపడతాడు.అలాగే కూతురిని పెంచి పెద్దదాన్ని చేస్తాడు. సీతకి కూడా తండ్రంటే ప్రాణం. అందుకే పెళ్లి చేసుకుంటే తండ్రిని దూరం చేసుకోవాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటుంది. మరోపక్క కూతురుకి పెళ్లి చేసి ఆమెకి మంచి జీవితాన్ని ఇవ్వాలనేది రాజేంద్రప్రసాద్ కోరిక. అయితే పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ ఉంటుంది సీత. తర్వాత ఓ వర్క్ షాప్ నిమిత్తం వైజాగ్ నుండి ఆమె హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు అభి (నిరంజన్) తో పరిచయం ఏర్పడుతుంది? వీరి ప్రయాణం చివరికి ఏ గమ్యానికి చేరుకుంది. మధ్యలో గిరి (అర్జున్), బసవన్న (ధృవ్ సర్జా) పాత్రలు ఏమిటి? సీత లక్ష్యం ఏంటి? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :

Advertisement

దర్శకుడిగా అర్జున్ సార్జా గతంలో కూడా కొన్ని సినిమాలు తీశారు. అన్నీ యాక్షన్ తో కూడుకున్నవే. అయితే అతని కెరీర్లో తొలిసారి ‘సీతా పయనం’ అనే లవ్ స్టోరీ తీశారు. ఈ ప్రాజెక్టు స్టార్టింగ్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. హీరోగా విశ్వక్ సేన్ ని అనుకున్నాడు. ప్రాజెక్టుని గ్రాండ్ గా లాంచ్ చేశాడు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ఓపెనింగ్ కి వచ్చి టీంని బ్లెస్ చేయడం జరిగింది. తర్వాత హీరో విశ్వక్ సేన్ షూటింగ్ కి సహకరించడం లేదు అంటూ.. అర్జున్ ఓ ప్రెస్ మీట్ పెట్టి, ఛాంబర్లో కంప్లైంట్ చేయడం జరిగింది. విశ్వక్ ని తప్పించి ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ ని హీరోగా తీసుకుని ప్రాజెక్టుని కంప్లీట్ చేశారు.విచిత్రంగా ‘సీతా పయనం’ రిలీజ్ టైంలోనే విశ్వక్ కొత్త సినిమా ‘ఫంకీ’ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ‘సీతా పయనం’ కథ పరంగా కొత్తగా ఏమీ ఉండదు. కానీ ఈరోజుల్లో ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి పట్ల యువత ఎలా వ్యవహరిస్తోంది? బంధాలని ఎంత సీరియస్ గా తీసుకుంటుంది? అనే సున్నితమైన అంశాలని తీసుకుని అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అర్జున్. హిందూ ధర్మం ప్రకారం పెళ్లి అనేది చాలా గొప్పది. గో రక్షణనే చాలా గొప్పగా భావించేది హిందూ ధర్మం. అలాంటిది ఇప్పటి యువత పెళ్లిని సీరియస్ గా తీసుకోకుండా విడాకుల వైపు మళ్ళుతూ.. బంధాలని లెక్కచేయకుండా జీవించడం అనే అంశాలని కూడా ఈ కథలో ప్రస్తావించాడు. అటెంప్ట్ గొప్పదే. అయితే వాటిని ప్రీచీగా చెప్పడం అనేది టార్గెటెడ్ ఆడియన్స్ కి క్లాసులు పీకినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ గా అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. ఫైట్ సీక్వెన్స్..లు అంత గొప్పగా లేవు. బహుశా సింగిల్ టేక్లో ప్యాకప్ చెప్పినవి అనుకుంట. ఎడిటింగ్ లోపాలు కూడా అక్కడక్కడా కనిపించాయి.

నటీనటుల విషయానికి వస్తే..

ఈ సినిమాలో హీరో ఉన్నప్పటికీ కథంతా ఐశ్వర్య అర్జున్ చుట్టూనే తిరుగుతుంది. సీత పాత్రలో ఆమె చాలా బ్యాలెన్స్డ్ గా నటించింది. ఎక్కడా హద్దులు దాటలేదు. నిరంజన్ చూడటానికి బాగానే ఉన్నాడు. కానీ అతని యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి టైం పట్టొచ్చు. సత్య రాజ్ ఎప్పటిలానే తనకి అలవాటైన తండ్రి పాత్రకి న్యాయం చేశాడు. అర్జున్ సార్జా కేమియో, ధృవ్ సార్జా కేమియోలు ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉంది. ప్రకాష్ రాజ్, బిత్తిరి సత్తి వంటి వాళ్ళు ఈ సినిమాలో నటించారు అనే కంటే కనిపించారు అనడమే కరెక్ట్.

ప్లస్ పాయింట్స్

Advertisement

కథ

ఫస్ట్ హాఫ్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ లో సాగదీత

ప్రీచీగా అనిపించే డైలాగులు

యాక్షన్ సన్నివేశాలు

మొత్తంగా..

‘సీతా పయనం’ మంచి కథతో రూపొందిన సినిమా. అక్కడక్కడా మెప్పిస్తుంది కానీ సెకండాఫ్ సాగదీయడంతో ఓ సాదా సీదా సినిమాలా మిగిలిపోతుంది. ఓటీటీలో అయితే ఇలాంటి సినిమాలు మెప్పించే ఛాన్స్ ఉంటుంది

రేటింగ్ : 2.25/5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×