Globe Trotter Event: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎం ఎం కీరవాణి (MM Keeravani)ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక త్వరలోనే కీరవాణి సంగీత సారధ్యంలో రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి గ్లోబ్ ట్రాటర్(Glob Trotter) వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వేదికపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని ఆయన హీరోగా నటించిన పోకిరి సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారణాసి సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ సినిమా 2027 సమ్మర్ (2027 Summer Release)లో విడుదల కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా కీరవాణి తెలియచేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కీరవాణి గారు మెలోడీ బాగా కొడతారు బీట్ అంతగా కొట్టారు అనే పేరు నాకు వచ్చింది. అందుకని ఈమధ్య నేను ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను. ఫ్లాట్ కొనడం అంటే హైదరాబాద్ లోనో, వైజాగ్ లోనో కాదు.. మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా మీ అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను అంటూ కీరవాణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఫ్లాట్ బిల్డర్ హ్యాండ్ అవర్ చేశారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ హ్యాపీ.. నా ఫ్లాట్ లో ప్రస్తుతం టైల్స్ వేస్తున్నారు.. 2027 సమ్మర్ కు ఈ ఫ్లాట్ గృహప్రవేశం అవుతుంది అంటూ ఈ సినిమా విడుదల గురించి కీరవాణి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అంచనాలు పెంచిన సంచారి..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఈ సినిమా స్టోరీ ఏంటో కాస్త చెప్పండి అని అడగడంతో ఈ సినిమా స్టోరీ చెబితే వల్లి మేడం నన్ను చంపేస్తారు అంటూ కీరవాణి ఈ సినిమాలో కుంభ పాత్ర గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు. ఇక కీరవాణి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై రెట్టింపు స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఇదివరకు ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలొచ్చాయి. ఈ సినిమా 2027 మార్చ్ 25న రాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే కీరవాణి కూడా 2027 సమ్మర్ లో విడుదల కాబోతుందనే విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన సంచారి పాట సంచలనాలని సృష్టించిన సంగతి తెలిసిందే.
Also Read: Globe Trotter Event: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్…విశ్వరూపం చూపించబోతున్న మహేష్!