E-Paper
Advertisement

Globe Trotter Event: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్…విశ్వరూపం చూపించబోతున్న మహేష్!

Globe Trotter Event: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్…విశ్వరూపం చూపించబోతున్న మహేష్!
Advertisement

Globe Trotter Event: రాజమౌళి (Rajamouli)మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా హైదరాబాద్లో గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంతో పాటు ఎంతోమంది అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం ఒక్కొక్కరు వేదిక పైకి వెళ్తూ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

మహేష్ విశ్వరూపం చూస్తారు..

ఈ క్రమంలోనే సినిమా రచయిత ఎంపీ విజయేంద్రపసాద్ (vijayendra Prasad)ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మనం ఏదైనా ఒక పని జరుగుతుంది అంటేనే దేవుడి ఆజ్ఞతోనే జరుగుతుందని అలాగే మనుషుల చేత కొన్ని పనులు దేవతలు చేయించుకుంటారని తెలిపారు. ఇక ఈ సినిమాని కూడా ఆ దేవుడే చేయించుకున్నారని తెలిపారు. ఇక విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉందని తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ బాబు విశ్వరూపం చూస్తారు అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా పట్ల పెద్ద ఎత్తున అంచనాలను పెంచేసాయి.

అంచనాలు పెంచిన విజయేంద్ర ప్రసాద్..

Advertisement

ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగేటప్పుడు ఎలాంటి సీజీ ఎఫెక్ట్ లేదు, ఎలాంటి రీ రికార్డింగ్ లేదు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత అద్భుతంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ వచ్చింది అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ కార్యక్రమం గురించి కూడా నిర్మాత అలాగే రాజమౌళి కుమారుడు కార్తికేయ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు.

వారణాసి టైటిల్ పిక్స్..

Advertisement

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ తెలియజేస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: SSMB 29 Title: ఇట్స్ అఫీసియల్.. మహేష్ బాబు – రాజమౌళి మూవీ టైటిల్ ఇదే

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×