E-Paper
Advertisement

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమా కన్నా కన్నడ సినిమాకు ఎక్కువ క్రేజ్… ఇదెక్కడి విడ్డూరం!

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమా కన్నా కన్నడ సినిమాకు ఎక్కువ క్రేజ్… ఇదెక్కడి విడ్డూరం!
Advertisement

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు వచ్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో..తెలుగు సినిమాలకే ఇక్కడ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు మాత్రం ఒక కన్నడ సినిమా గురించి.. తెలుగు సినిమాలకన్నా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అదే యాష్ హీరోగా వస్తున్న టాక్సిక్. కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న యాష్ సినిమా కాబట్టి ఈ చిత్రం పై అంచనాలు ఉండడం సహజమని మీరు అనుకోవచ్చు. కానీ తెలుగు ప్రేక్షకులు…‌ పవర్ స్టార్ గా భావించే పవన్ కళ్యాణ్ సినిమా కన్నా ఈ సినిమాకి క్రేజ్ ఎక్కువవుతుంది అని వినిపించడమే.. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (AP/TG) ప్రాంతాల్లో రూ.120 కోట్ల థియేట్రికల్ డీల్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఖ్య పూర్తిగా అవాస్తవమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ భారీ ఫిగర్‌ను సినిమా మేకర్స్ నుంచే బయటకు పంపారని టాక్.

ఇది నిజమేనా..!

Advertisement

ఇక్కడ ఒక చిన్న పోలిక చూస్తే విషయం అర్థమవుతుంది. యష్ నటించిన సూపర్ హిట్ KGF Chapter 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం క్లోజింగ్ షేర్ సుమారు రూ.84 కోట్లు మాత్రమే. అంత పెద్ద బ్లాక్‌బస్టర్‌కే అంతే వసూళ్లు వస్తే, ‘టాక్సిక్’ సినిమాకు రూ.120 కోట్ల డీల్ ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అందుకే ఈ సంఖ్యలు కేవలం హైప్ కోసమే అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమాకి మించి..!

ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. మార్చి 26న విడుదల కానుంది. అంటే ‘టాక్సిక్’ కంటే వారం తర్వాతే ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి భారీ స్టార్ ఉన్నా కూడా, ఈ సినిమా AP/TGలో రూ.120 కోట్ల డీల్ చేస్తుందా అనే విషయంలో ట్రేడ్ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇప్పటికీ ఇంత బిజినెస్ జరగలేదు. మరి టాక్సిక్ సినిమా విషయంలో ఇలాంటి వార్తలు వస్తుండటంతో.. ఇది తప్పకుండా పుకారే అని అందరి ఫిక్స్ అవుతున్నారు.

Advertisement

పవన్ కళ్యాణ్ సినిమా కంటే, ఒక కన్నడ హీరో సినిమా గురించి ఎక్కువగా హైప్ క్రియేట్ కావడం నిజంగా విడ్డూరమే. సోషల్ మీడియాలో ట్రెండ్స్, ఫ్యాన్ వార్స్, బాక్సాఫీస్ అంచనాలు అన్నీ ‘టాక్సిక్’ చుట్టూనే తిరుగుతున్నాయి. టాక్సిక్ సినిమాకు వస్తున్న బిజినెస్ అంకెలు వాస్తవమా లేక కేవలం ప్రచారమా అనేది సినిమా విడుదలయ్యాకే తేలాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చర్చ సినీ ప్రియుల మధ్య పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: Vijay Sethupathi: మాట మీద నిలబడని విజయ్ సేతుపతి.. ఆ సినిమాలో పాత్ర కోసమే ఇదంతా..!

Related News

పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

సంక్రాంతి రేసులోనే ‘కాకా’ మేకర్స్ క్లారిటీ.. ‘విశ్వంభర’ వెనక్కి తగ్గాల్సిందేనా!

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రమేష్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

40ల్లోనూ తగ్గని అందం.. అనసూయ గ్లామర్ లుక్స్ వైరల్!

సెన్సార్ పూర్తి చేసుకున్న సెప్టెంబర్ 18 రిలీజ్ చిత్రాలు.. ఏ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

బీచ్ లో డాన్స్ చేస్తూ..కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్ .. వీడియో వైరల్!

‘కాకా’ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ.. నిజమెంత?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఇప్పటిల్లో లేనట్లే..?

Big Stories

Advertisement
×