E-Paper
Advertisement

Actor Madhvan : మాధవన్ మహేష్ తండ్రిగా కాదా…ఆ  పాత్రలో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

Actor Madhvan : మాధవన్ మహేష్ తండ్రిగా కాదా…ఆ  పాత్రలో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
Advertisement

Actor Madhvan: మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి (Rajamouli)కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారణాసి(Varanasi) సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ప్రకటించడంతో ఈ టైటిల్ కాస్త ట్రెండింగ్ లో ఉండటమే కాకుండా వివాదాలకు కూడా కారణమైంది. ఈ సినిమా ఈవెంట్లో రాజమౌళి దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడటంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అదే విధంగా వారణాసి అనే టైటిల్ ను మరొక నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించినప్పటికీ రాజమౌళి సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టడంతో ఈ పంచాయతీ ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్ళింది.

హనుమంతుడి పాత్రలో మాధవన్?

ఈ విధంగా వారణాసి సినిమా ప్రస్తుతం వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నట్లు స్వయంగా రాజమౌళి కూడా వెల్లడించారు అయితే మహేష్ బాబు రాముడు అయితే హనుమంతుడు ఎవరు అనే ప్రశ్న పలు సందేహాలకు కారణం అవుతుంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వారణాసి సినిమాలో హనుమంతుడిగా(Lord Hanuman) కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్(Madhvan) కనిపించబోతున్నట్టు సమాచారం.

మహేష్ తండ్రిగా మాధవన్?

Advertisement

ఇదివరకు మాధవన్ ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలలో నిజం లేదని మహేష్ బాబుకి తండ్రిగా కాకుండా లార్డ్ హనుమాన్ పాత్రలో మాధవన్ నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా హనుమంతుడి పాత్రకి మాధవన్ సెలెక్ట్ అయ్యారు అనే విషయం తెలియడంతో ఈ పాత్రకు ఈయన సెట్ అవుతారా? అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ సినిమాలో మాధవన్ నటించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

వారణాసిలో భాగం కాబోతున్న మాధవన్..

Advertisement

ఈ సినిమాకి సంబంధించి గ్లోబ్ ట్రాటర్ పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయడంతో ఈ రెండు పోస్టర్లపై మాధవన్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈయన కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని అందుకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ పై స్పందిస్తున్నారని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్లో భాగంగా మాధవన్ పై కూడా కొన్ని సన్నివేశాలు షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. మరి మాధవన్ హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించే వరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: Shah Rukh Khan: సినిమాలలోనే కాదు.. చదువులోనూ షారుక్ తోపే.. మార్క్స్ లిస్ట్ చూసారా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×