E-Paper
Advertisement

2025–26 Ashes series: ‘బూడిద’ కోసం 143 ఏళ్లుగా ఫైట్‌.. ‘యాషెస్ సిరీస్ షెడ్యూల్‌, చ‌రిత్ర ఇదే

2025–26 Ashes series: ‘బూడిద’ కోసం 143 ఏళ్లుగా ఫైట్‌.. ‘యాషెస్ సిరీస్ షెడ్యూల్‌, చ‌రిత్ర ఇదే
Advertisement

2025–26 Ashes series: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఎల్లుండి నుంచే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభం ( 2025–26 Ashes series ) కానుంది. నవంబర్ 21వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ (Australia vs England) మధ్య ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ లు రెండు జట్ల మధ్య జరగనున్నాయి. యాషెస్ టెస్ట్ సిరీస్ 2025- 2026 టోర్నమెంట్ ఈ సారి ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోంది. నవంబర్ 21వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ ఐదు టెస్టుల సిరీస్ జరుగుతుంది.

Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?

143 సంవత్సరాలుగా బూడిద కోసం ఫైటింగ్

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 143 సంవత్సరాలుగా ఈ యాషెస్ టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ రేంజ్ లో ఈ టోర్నమెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా రెండు జట్లు తలపడతాయి. ఈ సిరీస్ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే, 1982 సంవత్సరంలో ది ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ పైన ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ తొలి టెస్ట్ విజయం నేపథ్యంలో ఇంగ్లాండ్ కు వ్య‌తిరేకంగా బ్రిటిష్ వార్తాపత్రికలో అనేక రకాల వార్తలు ప్రచురణ అయ్యాయి. బ్రిటిష్ వార్త పత్రిక ది స్పోర్టింగ్ టైమ్స్ లో క్రికెట్ ఇంగ్లాండ్ ను విమర్శలు చేస్తూ ప్రత్యేక కథనం ప్రచురణ అయింది. క్రికెట్ అనేది ఇంగ్లాండ్ కనిపెట్టింది.. అలాంటి ఇంగ్లాండ్ క్రికెట్ ఈ ఒక్క పరాజయంతో చచ్చిపోయింది.

ఆ బూడిదను ఆస్ట్రేలియా తీసుకువెళ్లింది అంటూ ఈ ఇంగ్లీష్ పత్రిక కథనం రాసుకొచ్చింది. ఇలాంటి తరుణంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఐవో బ్లైగ్ ( Ivo Bligh)… సంచలన శపథం చేశాడు. ఆస్ట్రేలియా తీసుకువెళ్లిన ఆ బూడిదను మళ్లీ ఇంగ్లాండ్ కు తీసుకు వస్తానని పేర్కొన్నాడు. దీంతో ఆ సిరీస్ కు యాషెస్ అనే పేరు పెట్టడం జరిగింది. యాషెస్ అంటే బూడిద‌. దీంతో అప్పటి నుంచి ఆ బూడిద కోసం ఇప్పటివరకు ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నమెంట్ జరగనుంది. ఒక టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో జరుగుతే తర్వాత వచ్చే టోర్నమెంట్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఈ 143 సంవత్సరాలలో మొత్తం 72 సిరీస్ లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 34 సిరీస్ లు కైవసం చేసుకోగా ఇంగ్లాండ్ 32 గెల్చుకుంది. మొత్తం 6 సిరీస్ లు డ్రాగ ముగిశాయి.

యాషెస్ సిరీస్ టైమింగ్స్‌, ఎలా ఎక్కడ చూడాలంటే

Advertisement

యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి ఉదయం ఐదున్నర గంటలకు మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. తొలి టెస్ట్ 8 గంటలకు ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మాత్రం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. మిగిలిన మూడు టెస్టులు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక ఈ టోర్నమెంట్ ఇండియాలో చూడాలంటే సోని స్పోర్ట్స్ నెట్వర్క్ లో ( Sony Sports Network) చూడవచ్చు.

Also Read: Hardik Pandya: ఆగ‌లేక‌పోతున్న‌ హార్దిక్ పాండ్యా, జిమ్ లోనే శృ**గారం..బోల్డ్ ఫోటోలు వైర‌ల్ !

 

 

 

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×