E-Paper
Advertisement

Shah Rukh Khan: సినిమాలలోనే కాదు.. చదువులోనూ షారుక్ తోపే.. మార్క్స్ లిస్ట్ చూసారా?

Shah Rukh Khan: సినిమాలలోనే కాదు.. చదువులోనూ షారుక్ తోపే.. మార్క్స్ లిస్ట్ చూసారా?
Advertisement

Shah Rukh Khan: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో సీనియర్ నటుడు షారుక్ ఖాన్(Shah Rukh khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న షారుఖ్ ఖాన్ ఇప్పటికీ వరుస సినిమాలలో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలెబ్రెటీలు షారుక్ ఖాన్ కు వీరాభిమానులుగా ఉన్నారు.

షారుక్ మార్కులు జాబితా చూశారా..

ఇలా నటనలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న షారుఖ్ ఖాన్ చదువుల్లో కూడా మంచి నైపుణ్యం గల విద్యార్థి అని తెలుస్తోంది. తాజాగా ఈయన కాలేజీ చదువులకు సంబంధించి ఒక మార్కుల జాబితా(Mark Sheet) సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.షారుఖ్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న హన్స్‌రాజ్ కాలేజీలో(Hans Raj College) తన విద్యాభ్యాసం పూర్తి చేశారని తెలుస్తుంది. తాజాగా ఈ కాలేజీలో ఈయన డిగ్రీకి సంబంధించిన మార్కుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మార్కుల జాబితాని బట్టి చూస్తుంటే షారుఖ్ ఖాన్ తండ్రి పేరు తాజ్ మొహమ్మద్ అని తెలుస్తోంది.

చదువులోనూ ఇంటిలిజెంట్..

Advertisement

ఈ మార్పుల జాబితా ప్రకారం షారుఖ్ ఖాన్ ఎలక్టివ్ అనే సబ్జెక్టులో 92, ఇంగ్లీషులో 51, మ్యాథ్స్ 78, ఫిజిక్స్ 78 మార్కులు వచ్చినట్టు స్పష్టం అవుతుంది. ఇలా 100కు గాను 92, 78 మార్కులు చొప్పున రావడంతో షారుఖ్ ఖాన్ చదువు విషయంలో కూడా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని స్పష్టం అవుతుంది. ఇక ఈ మార్పుల జాబితా వైరల్ గా మారడంతో అభిమానులు ఈ మార్క్స్ లిస్టును మరింత వైరల్ చేస్తున్నారు. ఇలా చదువులలో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.

కింగ్ సినిమా పనులలో బిజీగా షారుక్..

Advertisement

ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన కింగ్ (King)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అభయ్ వర్మ, దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించబోతున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే.సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు స్వయంగా షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యానర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా 2026వ సంవత్సరంలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయన చివరిగా జవాన్ అనే సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత డుంకీ వంటి సినిమాలలో నటించారు అయితే ఈ సినిమాలు కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాయి.

Also Read: Ustad Bhagat Singh Release: ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది అప్పుడే… రిలీజ్ పై బిగ్ అప్డేట్!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×