Annagaru Vostaru: ఇటీవల కాలంలో సినిమాల విడుదల తేదీలను ప్రకటించి పెద్ద ఎత్తున సినిమాలను ప్రమోట్ చేసిన చివరి వరకు సినిమాలు విడుదలవుతాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటికి నిన్న బాలకృష్ణ నటించిన ఆఖండ 2 సినిమా చివరి నిమిషాలలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ఈ సమస్యలన్నీ దాటుకొని తిరిగి ఆఖండ 2 విడుదల కాబోతోంది. ఈ తరుణంలోనే మరో సినిమాకు కూడా ఇదే తరహా పరిస్థితులు తలెత్తాయని తెలుస్తుంది.
ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీ(Karthi) హీరోగా నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నగారు వస్తారు(Annagaru Vostaru). ఈ సినిమా తమిళంలో వా వాతియార్ అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మరొక రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఊహించని విధంగా ఈ సినిమాకు షాక్ ఇచ్చింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇదివరకు చెల్లించాల్సిన 21.7 కోట్ల రూపాయల బకాయిలను తిరిగి చెల్లించాలని ఆ డబ్బులు చెల్లించే వరకు అన్నగారు వస్తారు సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఇలా ఈ సినిమాకి కూడా ఫైనాన్స్ ఇబ్బందులు చోటుచేసుకున్నాయని పాత బకాయిలు చెల్లించే వరకు సినిమా విడుదలకు వీలు లేదంటూ కోర్టు తీర్పు వెల్లడించడంతో ఈ సినిమా విడుదల విషయంలో కూడా సందిగ్ధంలో నెలకొంది. మరి ఈ సినిమా అనుకున్న విధంగానే డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే అఖండ 2 తరహాలోనే వాయిదా పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర నిర్మాతలు ఎక్కడ కూడా స్పందించకపోవడం గమనార్హం. నిజానికి గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఫైనాన్స్ ఇబ్బందులను ఎదుర్కోవడంతో విడుదల ఆలస్యం అవుతూ వచ్చిందని వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇదే సమస్య కారణంగా విడుదల వాయిదా పడుతుందని తెలుస్తుంది.
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బేబమ్మ..
మరి కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే కార్తీ, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో కార్తీ డిఎస్పిగా కనిపించబోతున్నారు ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. మరి ఈ సినిమా విడుదల గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే తెలుగులో వరుస సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ రాని నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మరి కోలీవుడ్ ఇండస్ట్రీలోనైనా కృతి శెట్టికి కలిసొచ్చేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Mowgli First ticket: మోగ్లీ ఫస్ట్ టికెట్ కొన్న స్టార్ హీరో.. ధర ఎంత అంటే?