IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టోర్నమెంటులో కంటే మన ఐపీఎల్ కు ఎక్కువ వ్యూవర్‌షిప్ వస్తుంది. డిమాండ్ కూడా ఈ టోర్నమెంట్ కు ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్లేయర్లందరూ ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఆ టోర్నమెంట్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నివేదిక లక ప్రకారం ఏకంగా 9.6 బిలియన్ల ఐపీఎల్ 2025 బ్రాండ్ విలువ తగ్గిందట.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పై బ్రాండ్ ఫైనాన్స్ (Brand Finance ) ఓ నివేదిక బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఐపిఎల్ 2024 కంటే 2025 టోర్నమెంట్ బ్రాండ్ విలువ అమాంతం పడిపోయింది అంట. మొత్తం 20% ఐపిఎల్ 2025 టోర్నమెంట్ బ్రాండ్ విలువ తగ్గినట్లు బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. అంటే 9.6 బిలియన్ల డాలర్ల నష్టం వాటిని అన్నమాట. అంటే మొత్తంగా రూ. 86,932 కోట్ల నష్టం బీసీసీఐకి వాటిల్లినట్లు చెబుతున్నారు. 2020 కరోనా మహమ్మారి సందర్భంగా ఇలాగే బ్రాండ్ విలువ పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాండ్ విలువ పెరుగుతూ వచ్చినప్పటికీ గత సీజన్ లో మాత్రం బ్రాండ్ విలువ తగ్గిందట.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 Tournament ) జరుగుతున్న సమయంలోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పహల్గాం సంఘటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధమే చోటు చేసుకుంది. ఏప్రిల్ 22వ తేదీ 2025 జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం దగ్గర ఈ సంఘటన జరిగింది. అయితే ఈ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2025 టోర్నమెంటును అర్ధాంతరంగా ఆపేశారు. అలా ఆపేయడంతో విదేశీ ప్లేయర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. దాదాపు 15 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. దీనివల్ల ఐపిఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 Tournament ) చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు బ్రాండ్ విలువ పైన కూడా పడింది. అలాగే రియల్ మనీ గేమింగ్ యాడ్స్ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. దాని వల్ల కూడా ఐపీఎల్ బ్రాండ్ విలువ తగ్గిందట. అలాగే కొన్ని వాణిజ్యపరమైన సవాళ్ల కారణంగా కూడా ఐపీఎల్ విలువ తగ్గినట్లు చెబుతున్నారు. అయితే, ఐపీఎల్ 2025 బ్రాండ్ విలువ తగ్గడం వెనుక పీఎస్ ఎల్ 2025 కూడా ఉందని పాకిస్తాన్ సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ వైరల్ గా మారాయి. ఐపీఎల్ టోర్నమెంట్ జరిగినప్పుడు పీఎస్ ఎల్ 2025 జరిగిందని, దాంతో వీక్షకులు తమ వైపునకు వచ్చారని పేర్కొంటోంది పాకిస్తాన్.
2025 – PSL & IPL clashed for the first time.
IPL valuation dropped 20% in 2025. pic.twitter.com/2YGq9uxL35
— Sheri. (@CallMeSheri1_) December 10, 2025