E-Paper
Advertisement

Oscars 2026: ఆస్కార్ రేసులో రెండు సౌత్ చిత్రాలు.. టాలీవుడ్ నుంచి ఒక్క సినిమా లేదా..?

Oscars 2026: ఆస్కార్ రేసులో రెండు సౌత్ చిత్రాలు.. టాలీవుడ్ నుంచి ఒక్క సినిమా లేదా..?
Advertisement

Oscars 2026: సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అంటే ఆస్కార్. తమ సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలని చాలామంది చిత్ర నిర్మాతలకు కలలు కంటూ ఉంటారు. అయితే ఆ అదృష్టం కొన్ని సినిమాలకు మాత్రమే ఉంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలకన్నా చిన్న స్టోరీ లైన్‌తో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఆస్కార్ రేసులో నిలుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా సినిమాలు ఆస్కార్ బరిలో ఉన్నాయి.

98వ అకాడమీ అవార్డుల కోసం కౌంట్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో, భారతీయ సినిమా మరో ముందడుగు వేసింది. ఈ ఆస్కార్ రేసులో సౌత్ ఇండస్ట్రీ నుంచి రెండు సినిమాలు సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. మరి ఆ సినిమాలేవి? టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా అయిన ఆస్కార్ లిస్ట్ లో ఉందేమో ఒకసారి తెలుసుకుందాం..

ఆస్కార్ రేసులో ఉన్న సౌత్ సినిమాలు..

Advertisement

ఈ ఏడాది ఆస్కార్ అవార్డు కోసం కొన్ని సినిమాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే పలు సినిమాల పేర్లు లిస్ట్ లో ఉన్నట్లు తెలిసిందే.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా చేరింది. అలాగే మోస్ట్ వాంటెడ్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా కూడా ఆస్కార్ కు సెలెక్ట్ అయ్యింది.. దేవుడి కథతో ఈ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

గత ఏడాది రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. అదేవిధంగా మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి.. కింద ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.. ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ రావడంతో సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది..

Advertisement

Also Read : విజయ్ జన నాయగన్‌కు లైన్ క్లియర్… సెన్సార్‌ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు..

ఏ క్యాటగిరిలో పోటీ పడుతున్నాయంటే..? 

ఈ రెండు సినిమాలు ఆస్కార్ పోటీలో నిలవడం మామూలు విషయం కాదు.. నిజానికి రెండు సినిమాలు కూడా దేవుడికి సంబంధించిన స్టోరీలతోనే వచ్చాయి. ఆ స్టోరీ ప్రేక్షకులను బాగా మెప్పించడంతో ఈ చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లాయి.. ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, నిర్మాత స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ కేటగిరిల్లో ఈ రెండు సినిమా పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూడా హోంబలే బ్యానర్ పైనే నిర్మించబడ్డాయి.

మరి ఈ రెండు సినిమాలకు ఏ క్యాటగిరిలో అవార్డు దక్కుతుందో చూడాలి.. గత ఏడాది తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆస్కార్ రేసులో నిలబడలేదు.. వచ్చే ఏడాదిలో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.. మరి 2027 లో ఆస్కార్ బరిలో తెలుగు సినిమా ఉంటుందేమో చూడాలి..

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×