E-Paper
Advertisement

Jana Nayagan : విజయ్ జన నాయగన్‌కు లైన్ క్లియర్… సెన్సార్‌ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు..

Jana Nayagan : విజయ్ జన నాయగన్‌కు లైన్ క్లియర్… సెన్సార్‌ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement

Jana Nayagan : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్.. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్ కి ఎమోషనల్ గా మారింది. ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అందుకే దీన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. నిజానికి ఈ మూవీ ఇవాళ థియేటర్లలోకి రావాల్సి ఉంది. సినిమాపై సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది. ఇందులోని 32 సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. అందుకే విడుదలకు ఒకరోజు ముందు జన నాయగన్ మూవీ వాయిదా పడింది.. సెన్సార్ అభ్యంతరాలకు ఒప్పుకొని మూవీ టీం కోర్టుకు వెళ్లారు. తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరారు.. తాజాగా విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ చిత్ర యూనిట్ కి ఊరట కలిగించే న్యూస్ ని చెప్పింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశాలు. సెన్సార్ బోర్డు సభ్యులకు జన నాయగన్ కి U/A సర్టిఫికేట్‌నే ఇవ్వాలని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. మొత్తానికి కోర్టు తీర్పుతో ఈ సినిమాకు లైన్ క్లియర్ అయిపోయింది.. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

రిలీజ్ కు ముందే విజయ్ సినిమాకు షాక్..

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చివరి సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.. డైరెక్టర్ వినోద్ దశకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఇందులో 32 అభ్యంతర సీన్లు ఉన్నాయని తెలిపింది. యు/ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ లో ఇలాంటి అభ్యంతరాలు తెలపడంతో చిత్ర యూనిట్ కోర్టుని ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా నేడు కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఫిటిషన్ పై పూర్తిగా విచారించిన కోర్టు సినిమాకు ఊరట కలిగించే గుడ్ న్యూస్ ను చెప్పింది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను ఇవ్వాలని ఆదేశించింది.. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.. ఈ డేట్ పై ఆసక్తి నెలకొంది..

Advertisement

Also Read: మహేష్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘వారణాసి’ షూటింగ్ ఎక్కడంటే..?

జన నాయగన్ బడ్జెట్ ఎంతంటే..? 

జన నాయగన్ మూవీలో హీరోగా విజయ్ దళపతి నటించగా.. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. దాదాపుగా రూ. 352.60 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ వల్ల కూడా భారీగానే బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. ఈ మూవీ ప్రీ బిజినెస్ బాగా జరిగింది. విజయ్ కు రూ. 220 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకుందని సమాచారం.. ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియో కంపెనీ 120 కోట్ల రూపాయల ఆఫర్‌తో సొంతం చేసుకుంది.. మరి ఈ మూవీ ఎన్ని కోట్లో వసూల్ చేసింది..

Related News

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×