E-Paper
Advertisement

Jigris OTT : అమెజాన్ ప్రైమ్ లో దుమ్మురేపుతున్న కామెడీ డ్రామా… మరో ఓటీటీలోనూ ‘జిగ్రీస్’ నవ్వుల జాతర

Jigris OTT : అమెజాన్ ప్రైమ్ లో దుమ్మురేపుతున్న కామెడీ డ్రామా… మరో ఓటీటీలోనూ ‘జిగ్రీస్’ నవ్వుల జాతర
Advertisement

Jigris OTT : కామెడీ పేరుతో కడుపుబ్బా నవ్వించడం అన్నది మేకర్స్ కు అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఒకరకంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది. కామెడీ హద్దులు దాటితే విమర్శలు తప్పవు. తక్కువైతే ఆడియన్స్ కు నచ్చదు. అటు ప్రేక్షకులను, ఇటు క్రిటిక్స్ ను సైతం మెప్పించేలా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’. ఇటీవలే డిజిటల్ స్ట్రీమింగ్ షురూ చేసిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఓటీటీలో కడుపుబ్బా నవిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)తో పాటు సన్ నెక్స్ట్ (SunNXT)లో కూడా అందుబాటులో ఉంది. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీ రెండు ఓటీటీలలోనూ ట్రెండింగ్‌ లో ఉంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు తమకు నచ్చిన ఓటీటీలో మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీతో పాటు ఎమోషనల్ గానూ కనెక్ట్ అవుతున్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 2025 నవంబర్ 14 థియేటర్లలో విడుదలైన ఈ యూత్ ఫుల్ కామెడీ-డ్రామా 2026 జనవరి 6 నుండి సన్ నెక్స్ట్ లో ప్రసారం అవుతోంది. ఐఎండీబీలో ఈ మూవీ 9.6 రేటింగ్ ఉండడం విశేషం.

Advertisement

దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల అసభ్యతకు తావు లేకుండా, ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా మూవీని తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల అద్భుతమైన కామెడీ టైమింగ్‌, మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ యాక్టింగ్ సినిమాలో హైలెట్. కృష్ణ వోడపల్లి నిర్మించిన ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సపోర్ట్ అందడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం కూడా బాగుంది. ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే ఈ వీకెండ్ ఈ క్లీన్ ఎంటర్టైనర్ పై తప్పకుండా ఒక లుక్కేయండి.

స్టోరీలోకి వెళ్తే…

సినిమాలో వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక), కార్తీక్ (కృష్ణ బూరుగుల), ప్రవీణ్ (రామ్ నితిన్) అనే నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. కాలేజీ పూర్తి కాగానే బిజీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. ఎవరికి వారే అన్నట్టుగా ఈ నలుగురి లైఫ్ బిజీబిజీగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి గోవా వెళ్లాలనుకుంటారు. కానీ అప్పుడు తాగిన మత్తులో ఉంటారు. అదే మత్తులో అందరూ కలిసి మారుతి 800 కారులో గోవాకు ట్రిప్పుకు వెళ్లిపోతారు. కానీ జర్నీ మధ్యలోనే డబ్బు, పర్స్‌ లు, మొబైల్స్ అన్నీ పారేసుకుంటూ వెళ్తారు. తీరా కార్ రిపేర్ రావడంతో వీళ్ళ కల్లు తెరుచుకుంటాయి. అప్పటికి గానీ అసలు తాగిన మత్తులో ఏం చేశారో అర్థం కాదు. మరి ఆ తరువాత వీళ్ళ పరిస్థితి ఏంటి ? గోవా ట్రిప్ ను ఎలా పూర్తి చేశారు ? రాత్రికి రాత్రే వీళ్ళు గోవాకు వెళ్లాలని అనుకోవడానికి గల కారణం ఏంటి ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే.

Advertisement

Also Read : అమ్మాయిల తలలు తెగ్గోసే సీరియల్ కిల్లర్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×