E-Paper
Advertisement

Mahavatar Narasimha: ఇట్స్ అఫీషియల్.. ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహ..

Mahavatar Narasimha: ఇట్స్ అఫీషియల్.. ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహ..
Advertisement

Mahavatar Narasimha: సినిమా ఇండస్ట్రీలో నటీనటులను ప్రోత్సహిస్తూ ఎన్నో అవార్డులను పురస్కారాలను అందజేస్తుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీకి అత్యంత ప్రాధాన్యతను కల్పించే అవార్డులలో ఆస్కార్ అవార్డు(Oscar Award) ఒకటి. ప్రతి ఏడాది ఈ ఆస్కార్ అవార్డులను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే 2026లో జరగబోయే 98వ ఆస్కార్(98 th Oscar) అవార్డుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని సినిమాల ఎంపిక ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆస్కార్ అకాడమీ నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంపికైన సినిమాల జాబితా విడుదల అయింది.

ఆస్కార్ నామినేషన్స్ లో మహావతార్ నరసింహ..

తెలుగులో ఇటీవల యానిమేషన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన రికార్డులను సాధించిన చిత్రం “మహావతార్ నరసింహ”(Mahavatar Narasimha). యానిమేషన్ ప్రపంచంలోనే సంచలనంగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ లో నిలబటం విశేషం. 98వ ఆస్కార్ అవార్డుల్లో భాగంగా యానిమేషన్ క్యాటగిరిలో ఈ సినిమాకు చోటు లభించింది. ఇలా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రూ. 300 కోట్ల కలెక్షన్లతో సంచలనం..

Advertisement

భక్తి, పురాణం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముఖ్యంగా నరసింహస్వామి, హిరణ్యకశిపుడు, ప్రహల్లాదుడి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్(hombale films) నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఒక యానిమేషన్ సినిమాకి ఈ స్థాయిలో ఆదరణ లభించడం అంటే ఎంతో గొప్ప విషయం. ఇలాంటి ఒక గొప్ప సినిమా హాలీవుడ్ యానిమేషన్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి 98వ ఆస్కార్ అవార్డులలో యానిమేషన్ క్యాటగిరిలో భాగంగా నామినేషన్స్ లో నిలవడం విశేషం.

హాలీవుడ్ సినిమాలకు పోటీగా..

Advertisement

ఇలా నామినేషన్ లో నిలిచిన ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ అవార్డును అందుకోవాలని ప్రతి ఒక్క భారతీయ ప్రేక్షకుల కోరుకుంటున్నారు. ఈ సినిమాకి కనుక ఆస్కార్ అవార్డు వస్తే.. మన ఇండియన్ యానిమేషన్ పరిశ్రమకే తల మానికంగా మారుతుందని చెప్పాలి. ఈ యానిమేషన్ క్యాటగిరి లో భాగంగా పాప్ డీమన్ హంటర్స్, డీమన్ స్లేయర్, ఇన్ఫినిటీ కాస్టెల్ వంటి యానిమేషన్ సినిమాలు కూడా పోటీగా నిలిచాయి. మరి ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాలతో పోటీపడుతూ నామినేషన్స్ లో నిలిచిన మహావతార్ నరసింహ సినిమా ఆస్కార్ అవార్డును అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Parasakthi : సంక్రాంతి బరిలోనే శివ కార్తికేయన్ పరాశక్తి… ఆకట్టుకుంటున్న పోస్టర్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×