Parasakthi: శివ కార్తికేయన్ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. నిజానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టీవీ యాంకర్ గా పని చేస్తూ అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయనకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే శివ కార్తికేయన్(Siva Karthikeyan) పరాశక్తి(Parasakthi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదల గురించి చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా తెలియచేశారు.
సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగ అని చెప్పాలి సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల సినిమాలు కూడా విడుదలవుతూ ఉంటాయి. ఈ సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో శివకార్తికేయన్ సైతం సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు పరాశక్తి సినిమా ద్వారా రాబోతున్నారు.. ఈ సినిమా 2026 జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక సంక్రాంతి పండుగకు తెలుగులో ప్రభాస్, చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయ్ థలపతి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఈ స్టార్ హీరోలు అందరికీ పోటీగా శివ కార్తికేయను కూడా సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక పరాశక్తి సినిమా విషయానికి వస్తే.. లేడీ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara)దర్శకత్వంలో శివ కార్తీకేయన్(Siva Karthikeyan) శ్రీ లీల(Sreeleela) జంటగా నటించారు.1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
శ్రీ లీల తమిళ డెబ్యూ చిత్రం…
ఈ సినిమాలో శ్రీ లీల శివ కార్తికేయన్ హీరో హీరోయిన్లుగా నటించగా జయం రవి,రవి మోహన్, అథర్వ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక పరాశక్తి సినిమా ద్వారా శ్రీ లీల తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా ఆమెకు తమిళ డెబ్యూ సినిమా కావటం విశేషం. ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస ఫ్లాప్ సినిమాలను ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలా తెలుగులో సక్సెస్ అందుకోలేకపోతున్న శ్రీ లీల తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మరి తమిళంలోనైనా పరాశక్తి సినిమా ద్వారా సక్సెస్ అందుకునేనా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా సుధా కొంగర దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసాయి.
Also Read: Ram pothineni: రామ్ పోతినేని ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? తెలుగులో ఎవరు నచ్చలేదా?