Ram Pothineni: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఖాతాలో గత కొన్నేళ్లుగా హిట్ సినిమాలు పడలేదు. ఈసారి ఎలాగైన బ్లాక్ బాస్టర్ కొట్టాలనే కసితో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం హీరో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దేశ విదేశాలలో ప్రీమియర్లతో సందడి మొదలు కానుంది..మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన మహేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది.. ఈ క్రమంలో రామ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
హీరో రామ్ కు టాలెంట్ ఉంది కానీ సక్సెస్ సినిమాలు మాత్రం తక్కువే.. ఈసారి రూటు మార్చి సరికొత్త కథతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో నటించాడు. ఈ నెల 27 న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న సమయంలో అక్కడ రామ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారట.. షూటింగ్ గ్యాప్ లో లేదా ప్యాకప్ చెప్పాక హీరోలు వెళ్లిపోవడం సహజం. కానీ రామ్ మాత్రం రాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండిపోయారట.. అతని చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానితో ఓపిగ్గా ఫోటోలు దిగారట హీరో రామ్.. రామ్ నిజానికి ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఆయన అభిమానులే నట.. మొత్తానికి అర్ధరాత్రి వరకు ఫ్యాన్స్ తో రామ్ గడపడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..
Also Read : రణరంగం ముగిసిపోనుంది.. చివరి కెప్టెన్సీ టాస్క్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
హీరో రామ్ కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు అనౌన్స్ చేశాడు.. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య రామ్ కు బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ మధ్య ఏ మూవీ చేసిన కూడా యావరేజ్ టాక్ ను అందుకుంటున్నాయి. తాజాగా ఆయన గంపెడు ఆశలతో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఒక డిఫరెంట్ స్టోరీతో తో రాబోతుంది. హీరో చుట్టూ తిరిగే అభిమాని కథతో ఈ మూవీ వస్తోంది. ఇందులో సాగర్ అనే అభిమాని పాత్రలో రామ్ కనిపించగా.. ఆంధ్రా కింగ్ సూర్య అనే హీరో పాత్రలో ఉపేంద్ర నటించాడు. ప్రతి హీరో అభిమాని ఇది నా స్టోరీ అనిపించేలా సినిమా కంటెంట్‌ని తీర్చిదిద్దారట. ముఖ్యంగా ఈ సినిమాలో హ్యూమానిటీ, ఎమోషన్స్ అందరినీ కట్టి పడేస్తాయని టీమ్ చెబుతుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం తన సినిమాని పాన్ ఇండియా లెవల్లో ప్రమోట్ చేస్తూ రామ్ ఫుల్ జోష్ తో కనిపిస్తున్నాడు. అతడి శ్రమ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి..