E-Paper
Advertisement

బిగ్ బాస్ వెళ్ళడానికి అదే కారణం.. కప్పు కొట్టడానికి కాదు..సుమన్ శెట్టి కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ వెళ్ళడానికి అదే కారణం.. కప్పు కొట్టడానికి కాదు..సుమన్ శెట్టి కామెంట్స్ వైరల్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ప్రతివారం ఒక్కో సెలబ్రిటీ ఈ కార్యక్రమానికి హాజరవుతూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా వెండితెరపై కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులు అందరిని మెప్పించి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల మదిని దోచుకున్న నటుడు సుమన్ శెట్టి (Suman Shetty)పాల్గొన్నారు. జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సుమన్ శెట్టి తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సుమారు 300కు పైగా సినిమాలు చేసి ఎంతోమంది ఆదరణ సొంతం చేసుకున్నారు.

కొడుకు కోసమే బిగ్ బాస్ వెళ్ళాను..

ఇలా కమెడియన్ గా ఎంతో బిజీగా ఉన్నా ఈయన ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం బిగ్ బాస్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సుమన్ శెట్టి దాదాపు 14 వారాలపాటు హౌస్ లో కొనసాగారు. ఈ కార్యక్రమం ద్వారా సుమన్ శెట్టిలో ఉన్న మరో యాంగిల్ బయటపడింది. తన మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సుమన్ శెట్టి ఏకంగా 14 వారాలపాటు హౌస్ లోకి కొనసాగారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

బిగ్ బాస్ 3 వ సీజన్ లోనే అవకాశం..

Advertisement

హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనే ప్రశ్న ఎదురవడంతో తనకు భరణి అన్న ఫేవరెట్ కంటెస్టెంట్ అని తెలిపారు. అసలు బిగ్ బాస్ (Bigg Boss 9)కార్యక్రమానికి ఎందుకు వెళ్లారు కప్ కొట్టడానికే వెళ్లారా? అంటూ ప్రశ్న ఎదురవడంతో సుమన్ శెట్టి మాట్లాడుతూ అసలు నేను ఒక రెండు మూడు వారాల పాటు హౌస్ లో ఉందామని వెళ్లాను కప్పు కొట్టడానికి కాదు అంటూ సమాధానం చెప్పారు. నాకు తొమ్మిదవ సీజన్లో కాకుండా మూడవ సీజన్ అలాగే ఐదవ సీజన్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చిందని అయితే ఆ సమయంలో కాస్త బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయానని సుమన్ తెలిపారు.

Advertisement

ఇక తొమ్మిదవ సీజన్లో కూడా వెళ్లడానికి కారణం మా కుమారుడు గౌతమ్ అని తెలిపారు. తన కొడుకు గౌతమ్ ఒకసారి నువ్వు కూడా హౌస్ లోకి వెళ్లి డాడీ చూడాలని ఉంది అంటూ చెప్పడంతో వాడి కోసమే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి ఒక మూడు లేదా నాలుగు వారాలు ఉందామని భావించాను అనుకోకుండా 14 వారాలపాటు హౌస్ లో ఉండదలిగానని ఈయన తెలియజేశారు. హౌస్ లోకి వెళ్లాలనుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో మనం ఎప్పుడు ఎలాగ ఉంటామో అక్కడ కూడా అలాగే ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఇక సంజనతో గొడవ గురించి కూడా తెలిపారు. ఆమె నా పర్సనల్ థింగ్స్ అన్నీ దాచడం వల్ల కోపం వచ్చేదని కానీ ఇప్పటికీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు అంటూ మాట్లాడిస్తుందని తెలిపారు. ఇక తనూజతో బాండింగ్ గురించి మాట్లాడుతూ తన భార్య వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు తనుజతో కొంచెం బాండింగ్ తగ్గించమని క్యాజువల్ గానే చెప్పారు అంటూ సుమన్ శెట్టి ఈ సందర్భంగా బిగ్ బాస్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముందు వరకు తనకు సినిమా అవకాశాలు పెద్దగా లేవని ఇప్పుడు వాళ్లే ఫోన్లు చేసి నాకు సినిమాలలో అవకాశాలు కల్పిస్తున్నారు ఇప్పుడు అంతా చాలా హ్యాపీగా ఉందని సుమన్ శెట్టి తెలిపారు.

Also Read:ఆ డైరెక్టర్ ఆర్టిస్టులను కొడితే సెలబ్రిటీలు అవ్వాల్సిందే… లక్కీ హ్యాండ్ అంటున్న సమన్ శెట్టి !

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×