E-Paper
Advertisement

Mahesh Rajamouli: మహేష్ బాబు కోసం క్యూ కడుతున్న పాన్ ఇండియా నిర్మాతలు.. తర్వాత ఛాన్స్ ఎవరికంటే?

Mahesh Rajamouli: మహేష్ బాబు కోసం క్యూ కడుతున్న పాన్ ఇండియా నిర్మాతలు.. తర్వాత ఛాన్స్ ఎవరికంటే?
Advertisement

Mahesh Rajamouli: మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’. ఇప్పటికే ఈ సినిమాకు పాన్ వరల్డ్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమాల మీద అందరి దృష్టి పడింది. ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా కోసం పాన్ఇండియా నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో మహేష్ డేట్స్ కోసం మైత్రీ మూవీ మేకర్ ముందు వరుసలో ఉంది.. ఆ తర్వాత హోంబులో ఫిల్మిం, సన్ పిక్చర్స్ ఇలా పాన్ ఇండియా నిర్మాతలు మహేష్ కోసం క్యూ కడుతున్నాయి. వారణాసి తర్వాత మహేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుండటంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. నిర్మాతలు మహేష్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు అంటే.. వారణాసి సినిమా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో మూవీ టీం వేగం పెంచింది. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న థియేటర్లలో విడుదల కానుంది.

Read also-Vijay -Rashmika: స్వయంగా పెళ్లి ఏర్పాట్లు.. ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన విజయ్ – రష్మిక!

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సునామీ!

Advertisement

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రాబోతున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ‘వారణాసి’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమౌళి మార్క్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం ఆఫ్రికన్ అడవుల చుట్టూ సాగే గ్లోబల్ అడ్వెంచర్ అని సమాచారం. ఇందుకోసం మహేష్ బాబు తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాజమౌళి ప్రతి సినిమాను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతారు, అందుకే ఈ సినిమా నిర్మాణం కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

Read also-Shivani Nagaram: నైటీలో ఉన్న ఫీల్ గురించి శివానీ నాగారం చెప్పింది ఇదే?.. బెస్ట్ కాస్టూమ్ అంట..

పెరిగిన క్రేజ్..

Advertisement

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే తదుపరి సినిమాల కోసం ఇంతటి డిమాండ్ రావడం కేవలం మహేష్ బాబుకే సాధ్యమైంది. వారణాసి షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో, మహేష్ కూడా తన తదుపరి లైనప్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. రాజమౌళి శిక్షణలో మహేష్ బాబు నటన, బాడీ లాంగ్వేజ్ ఒక అంతర్జాతీయ హీరో స్థాయిలో ఉండబోతున్నాయి. ఇది పూర్తయ్యాక, ఆయన చేసే ప్రతి సినిమా కూడా పాన్ వరల్డ్ స్థాయిలోనే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘వారణాసి’తో మహేష్ బాబు గ్లోబల్ ఐకాన్‌గా మారబోతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×