E-Paper
Advertisement

Vijay -Rashmika: స్వయంగా పెళ్లి ఏర్పాట్లు.. ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన విజయ్ – రష్మిక!

Vijay -Rashmika: స్వయంగా పెళ్లి ఏర్పాట్లు.. ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన విజయ్ – రష్మిక!
Advertisement

Vijay -Rashmika:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ రూమర్డ్ జంటగా ఇన్ని రోజులు కొనసాగిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna).. ఇకపై మరికొన్ని రోజుల్లో జంటగా దర్శనం ఇవ్వబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటికీ ఈ జంట ఓపెన్ అవ్వకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇకపోతే ఈ పెళ్లి వార్తలు ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకున్నాయనే వార్తలు సినీ వర్గాలలో వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు “మేము కేవలం స్నేహితులమే” అంటూ పబ్లిక్ లో స్పందించిన ఈ జంట.. ఇక నిజంగానే ఏడడుగులు వేయబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

పెళ్లి పనులు స్వయంగా.. విమానాశ్రయంలో జంటగా..

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజస్థాన్ జైపూర్ లోని ఉదయపూర్ లో ఉన్న ఒక చారిత్రక కోటలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుంది అని.. మార్చి 4వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ కూడా ఉండనుంది అని సోషల్ మీడియా ద్వారా వార్తలు లీక్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో స్వయంగా ఈ జంట సడన్గా ఎయిర్ పోర్ట్ లో  కనిపించేసరికి ఇక పెళ్లి పనులను స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు అని సమాచారం. ఇకపోతే విమానాశ్రయంలో వీరిద్దరూ విడివిడిగా కనిపించినా.. ఇద్దరు జైపూర్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ లో కనిపించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. 26 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ – రష్మిక రిసెప్షన్ కి ప్రముఖులు వీరే.

Advertisement

ఇకపోతే జైపూర్ లో జరిగే వివాహానికి సినీ సెలెబ్రెటీలను, రాజకీయ నాయకులను ఎవరిని ఆహ్వానించలేదు.. కానీ మార్చి 4వ తేదీన హైదరాబాద్లో జరిగే గ్రాండ్ రిసెప్షన్ పార్టీకి పలువురిని ఆహ్వానించినట్లు సమాచారం.. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరవుతారని తెలుస్తోంది. అటు విజయ్ కి అత్యంత సన్నిహితుడైన సందీప్ రెడ్డివంగా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారట. పైగా రష్మిక – విజయ్ తో కలిసి పనిచేసిన దర్శకులు , టెక్నీషియన్లు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ:Vijay Deverakonda: 26 కోసం వెయిటింగ్.. కెమెరామెన్ ప్రశ్నకు విజయ్ దిమ్మతిరిగే సమాధానం!

ఉదయపూర్ కోట సాక్షిగా వివాహం..

Advertisement

దీనికి తోడు విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించడంతో.. ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. ఏది ఏమైనా గీతాగోవిందం సినిమా నుంచి మొదలైన ఈ జంట కెమిస్ట్రీ ఇప్పుడు నిజజీవితంలో పెళ్లిగా మారబోతోందా అనే ఉత్కంఠ అభిమానులలో నెలకొంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా పెళ్లి మాత్రం ఖాయం అన్న నమ్మకంతో అటు అభిమానులు కూడా సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. మరి ఉదయపూర్ కోట సాక్షిగా జరిగే ఈ వేడుక కన్నుల పండుగ కావాలని ఆశిద్దాం..

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×