E-Paper
Advertisement

Varanasi : వారణాసి టైటిల్ వివాదం ఇంక అవ్వలేదు… ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్.. ఏం చేస్తున్నారంటే?

Varanasi : వారణాసి టైటిల్ వివాదం ఇంక అవ్వలేదు… ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్.. ఏం చేస్తున్నారంటే?
Advertisement

Varanasi : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా వారణాసి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి చాలామంది క్యూరియాసిటీతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పుడు నుంచి ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంది. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏకంగా హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు రాజమౌళి పైన మండిపడ్డారు. పలుచోట్ల కేసులు కూడా పెట్టారు.

రాజమౌళి మాట్లాడుతూ వెనకుండి హనుమంతుడు నడిపిస్తారు అని మా నాన్నగారు చెప్పారు. నడిపించడం అంటే ఇదేనా అని కొద్దిపాటి అసహనంతో మాట్లాడారు. ఆ మాటలు వల్లే పలు రకాల ఇబ్బందులు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో మరో వివాదం కూడా ఉంది. ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ అనుకుంటున్న తరుణంలోనే వేరే చిన్న సినిమా ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసి అనౌన్స్ కూడా చేసేసారు. దీంతో ఫిలిం ఛాంబర్ లో చర్చలు మొదలైపోయాయి.

మహేష్ ఫ్యాన్స్ అబ్జెక్షన్ 

Advertisement

ఇకపోతే వారణాసి అనే టైటిల్ వేరే సినిమా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి, ఈ టైటిల్ ను ఇంకొకరు వాడడానికి అవకాశం లేదు. అందుకనే టైటిల్ ముందు ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి అని తెలుగులో పెడుతున్నారు. మిగతా భాషల్లో మాత్రం వారణాసి అనే టైటిల్ ఉండబోతుంది.

ఇక్కడి వరకు అంతా సజావుగానే జరిగింది కానీ మహేష్ బాబు పేరును వెనక్కి పెట్టేసి కేవలం రాజమౌళి పేరు మాత్రమే వాడుతుండటం మహేష్ ఫ్యాన్స్ లో కొంతవరకు నిరాశ కలిగించింది. చాలామంది దీనిని సోషల్ మీడియాలో డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు వారణాసి అని ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయం.

Advertisement

అయితే రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది కాబట్టి రాజమౌళి వారణాసి అని ఉండటం సినిమాకు కొంత మేరకు కలిసి వస్తుంది. ఏదేమైనా దీని గురించి రాజమౌళి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఖలేజా సిచువేషన్ 

ఒకప్పుడు ఖలేజా అనే టైటిల్ ను వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే అప్పుడు కూడా ఇదే సమస్య ఎదురైనప్పుడు, త్రివిక్రమ్ మహేష్ కలేజా అని సినిమా పేరును మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య అప్పట్లో విడుదలైన ఆ సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది.

కానీ ఇప్పటికీ ఖలేజా సినిమా చాలామందికి ఫేవరెట్. రీ రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అందించారు. అద్భుతమైన కలెక్షన్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వారణాసి విషయంలో మహేష్ రాజమౌళి వారణాసి అంటారా? లేకపోతే రాజమౌళి వారణాసిని ఫిక్స్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Also Read: Venu Udugula : ప్రొడ్యూసర్ దొరికినంతవరకు శ్రీ విష్ణు శాలరీ ఇచ్చాడు, ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×