E-Paper
Advertisement

Venu Udugula : ప్రొడ్యూసర్ దొరికినంతవరకు శ్రీ విష్ణు శాలరీ ఇచ్చాడు, ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం

Venu Udugula : ప్రొడ్యూసర్ దొరికినంతవరకు శ్రీ విష్ణు శాలరీ ఇచ్చాడు, ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం
Advertisement

Venu Udugula : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా ప్రూవ్ చేసుకోవడానికి అంటే ముందు పడే కష్టాలు మాటల్లో వివరించలేము. వర్క్ తెలిసిన తర్వాత ఎప్పుడైతే సినిమా చేయాలి అని ప్రయత్నాలు మొదలుపెడతారు. చాలామంది దర్శకులకు అప్పుడే అసలైన సినిమా మొదలవుతుంది. ట్రైల్స్ వేస్తున్న తరుణంలో సినిమాలు వెంటనే వర్కౌట్ కాకపోవటం. కొంతమంది కొంతమంది హీరోలు అలానే నిర్మాతలు కూడా చెబుతాం అని ఆ కథని హోల్డ్ లో పెట్టడం లాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి.

అప్పుడు దర్శకత్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ కాబోయే దర్శకుడు ఇంకో పని చేయలేడు, ఈ ప్రయత్నాలలో ఇన్కమ్ సోర్సెస్ ఉండదు. ఇలా చాలామంది దర్శకులకు జరుగుతూ ఉంటుంది. నీది నాది ఒకే కథ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన వేణు ఊడుగుల కూడా ఇదే జరిగింది. నీది నాది ఒకే కథ సినిమాకు ఒక ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాత ఒక రెండు నెలలపాటు చర్చలు కొనసాగాయి. చివరగా ఒక టాప్ రైటర్ కు ఈ కథను చెప్పాలి అని నిర్మాత చెప్పినప్పుడు. ఆ టాప్ రైటర్ కు కథను చెప్పారు వేణు. చాలా బాగుంది పుస్తకానికి వర్కౌట్ అవుతుంది సినిమాకి పనిచేయదు అన్నారు ఆ రైటర్.

శ్రీ విష్ణు సాయం 

Advertisement

మొదట ఈ కథను నారా రోహిత్ కు చెప్పారు అప్పుడే శ్రీవిష్ణు విన్నారు. అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత నారా రోహిత్ సినిమాకు ఎంత అవుతుంది అని అడిగారు. వెంటనే కోటిన్నరలో అయిపోతుంది అని చెప్పారు వేణు. గ్యారెంటీగా అయిపోతుందా అని నారా రోహిత్ అడిగారు. మొత్తానికి ఆ సినిమా కేవలం 80 లక్షల లోనే పూర్తి చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. వేణు కూడా దర్శకుడుగా సెటిల్ అయిపోయాడు.

అయితే ప్రొడ్యూసర్ సెట్ కాకముందు వేణుకి విపరీతమైన ఫైనాన్షియల్ బర్డెన్ ఉండేది. వేణుకి మరియు శ్రీ విష్ణు కి నిత్యం కాఫీ షాప్ లో మీటింగ్ జరిగేది. వేణు డల్ గా ఉండటం చూసి ఏమైంది అని అడిగారు శ్రీ విష్ణు. ఇలా తన ఫైనాన్స్ ఇష్యూస్ చాలా మొహమాటంతో చెప్పేశారు వేణు. ఎంతుంటుంది అని అడగ్గానే వేణు ఒక ఫిగర్ చెప్తే దానిని క్లియర్ చేశారట శ్రీ విష్ణు. కథ మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని వేణుకి చెప్పాడు విష్ణు.

శాలరీ కూడా 

Advertisement

కేవలం సాయం చేయడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ సెట్ అయినంతవరకు. నెలకి 40,000 నుంచి 50 వేల వరకు ఆర్థిక సహాయం అందించేవారు శ్రీవిష్ణు. ఈ విషయాన్ని స్వయంగా వేణు ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదేమైనా అవతల వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఇలా సాయం చేయడం అనేది గొప్ప విషయం.

వేణు నిర్మాతగా రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్. ప్రశంసలతో పాటు విపరీతమైన కలెక్షన్లు కూడా ఈ సినిమాకు వస్తున్నాయి. ఒక ప్రస్తుతం రెండవ వారంలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

Also Read:Bigg Boss 9 : హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దివ్య నిఖిత, ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా బయటకు

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×