E-Paper
Advertisement

PAK VS SL Final: ఫైన‌ల్స్ లో శ్రీలంక చిత్తు..ట్రై సిరీస్ గెలుచుకున్న పాకిస్తాన్‌, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026కు ముందే డేంజ‌ర్ బెల్స్‌

PAK VS SL Final: ఫైన‌ల్స్ లో శ్రీలంక చిత్తు..ట్రై సిరీస్ గెలుచుకున్న పాకిస్తాన్‌, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026కు ముందే డేంజ‌ర్ బెల్స్‌
Advertisement

PAK VS SL Final: సొంత గడ్డపై పాకిస్తాన్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంక జట్టును చిత్తు చేసి టి20 ట్రై సిరీస్ 2025 ట్రోఫీని కైవసం చేసుకుంది పాకిస్తాన్. ఇవాళ ఈ టీ20 ట్రై సిరీస్ లో భాగంగా ఫైనల్స్ లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడ్డాయి.  ఈ ఫైన‌ల్స్ లో శ్రీలంకపై ఏకంగా  6 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుచుకుంది పాకిస్తాన్‌. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది పాకిస్తాన్. దీంతో టీ20 ట్రై సిరీస్ టోర్నమెంట్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు సొంత గడ్డపై ఈ విజయం పాకిస్తాన్ జట్టుకు భారీ ఊరటను ఇచ్చింది. ఇదే ఊపుతో టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ 2026 లో కూడా దూసుకు వెళ్లేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

ఫైనల్స్ లో శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్

Advertisement

రావాల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా టీ20 ట్రై సిరీస్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవ్వాల జరిగింది. ఇందులో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడ్డాయి. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 19.1 ఓవర్స్ లో కేవలం 114 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక ఓపెనర్ కమిల్ మిషారా ( Kamil Mishara) మినహా మిగిలిన ప్లేయర్లు అంద‌రూ దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక జట్టులో ఇద్దరు డక్ అవుట్ కూడా అయ్యారు. కమిల్ మిషారా ( Kamil Mishara) ఒక్కడే 47 బంతుల్లో 59 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి.

మిగిలిన బ్యాటర్లు తేలిపోవడంతో కేవలం 115 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది శ్రీలంక. ఇక సమిష్టిగా రాణించిన పాకిస్తాన్, లంక విధించిన‌ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. కేవలం 18.4 ఓవర్లు ఆడిన పాకిస్తాన్, 4 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టైటిల్ ఎగరేసుకు వెళ్లింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో ఫర్హాన్ 23 పరుగులు సాధించగా అయుబ్ 36 పరుగులతో దుమ్ములేపాడు. అటు బాబర్ ఆజం టచ్ లోకి వచ్చి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ లో 34 బంతుల్లోనే 37 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఒక సిక్స‌ర్ తో పాటు 2 బౌండ‌రీలు ఉన్నాయి. మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు నిల‌బ‌డ్డ బాబ‌ర్‌, శ్రీలంక‌ను ఓడించాడు. దీంతో ఈ ఫైన‌ల్స్ లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించింది. కాగా ఈ టోర్న‌మెంట్ లో మొత్తం మూడు జ‌ట్లు పాల్గొన్నాయి. జింబాబ్వే, శ్రీలంక‌, పాకిస్తాన్ పాల్గొన్నాయి. కానీ ఇందులో జింబాబ్వే ముందుగానే ఎలిగినేట్ కాగా, ఫైన‌ల్స్ దాకా శ్రీలంక‌, పాకిస్తాన్ వ‌చ్చాయి.

Advertisement

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×