E-Paper
Advertisement

Varanasi Movie : చరిత్ర సృష్టించిన ‘వారణాసి ‘.. రాజమౌళి అకౌంట్ లో మరో రికార్డ్..

Varanasi Movie : చరిత్ర సృష్టించిన ‘వారణాసి ‘.. రాజమౌళి అకౌంట్ లో మరో రికార్డ్..
Advertisement

Varanasi Movie : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం వారణాసి.. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను, టీజర్ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ అయితే జనాల నుంచి వచ్చింది. రాజమౌళి ఏ సినిమా తీసిన ఆ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలను మించేలా ఈ సినిమా ఉండబోతుందని ఆ వీడియోని చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ గురించి ఒక వైపు పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా, మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. వీటి సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు చరిత్రలో ఈ సినిమా మరో మైలురాయిని అందుకుంది. రాజమౌళి ఖాతాలో మరో రికార్డు పడిపోయింది. అసలు మ్యాటరేంటి? కేవలం టీజర్ తోనే రికార్డ్ బ్రేక్ చేసిందా? అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రిలీజ్ కు ముందే ‘వారణాసి’ రికార్డ్ బ్రేక్.. 

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి.. మూవీ టీజర్ తెలుగులో మాత్రమే కాదు. మిగిలిన దేశాల్లో కూడా సరికొత్త రికార్డుని సృష్టించింది.. రీసెంట్ గా ఫారీస్ లోని ప్రముఖ లే గ్రాండ్ లేక్స్ థియేటర్లలో ప్రదర్శించిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. యూరప్ లో కల్లా అతిపెద్ద థియేటర్ ఇదే.. ఇలాంటి పెద్ద స్క్రీన్ పై వారణాసి టీజర్ రిలీజ్ అవడంతో చిత్ర యూనిట్ అక్కడ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు.. రాజమౌళి సినిమాలంటే విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో అప్పుడే రికార్డుల కోత మొదలైపోయింది అని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఈ సినిమా 2027లో థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ మూవీ షూటింగ్ అప్డేట్ & రిలీజ్ డేట్..? 

Advertisement

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత వరుసగా దేశ విదేశాల్లో ప్రమోషన్స్ ని మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 2027 ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.. శ్రీరామ నవమి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే సినిమాకు మరింత ఆధ్యాత్మిక బలం చేకూరుతుందని టీమ్ భావిస్తున్నట్టు సమాచారం.. ఇందులో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆ రోజున రిలీజ్ చేస్తే సినిమాకు కలెక్షన్ల వర్షం బాగా కురిసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ పై ఒక ప్రకటన రాబోతుందని సమాచారం… రాజమౌళి సినిమాల గురించి జనాలకు ఒక అంచనా ఉంటుంది. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఈ సినిమా కూడా మరోసారి వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుందని జనాలు అభిప్రాయపడుతున్నారు..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×