E-Paper
Advertisement

Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ కాలుష్యం వల్లేనా?

Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ కాలుష్యం వల్లేనా?
Advertisement

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతోన్న ఆమెను హుటాహుటిన సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని, వైద్యుల పర్యవేక్షణంలో ఆమె కోలుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

వాయు కాలుష్యం వల్లేనా?

అయితే ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం వల్లే సోనియా అస్వస్థతకు గురై ఉండవచ్చని తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా ఢిల్లీ ప్రజలు గాలి కాలుష్యంతో అనారోగ్యానికి గురవ్వుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ.. ఎలాంటి సానుకూల ఫలితం కనిపించడం లేదు. ప్రజలు ఊపిరి పీల్చుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు సెలవులు కూడా ప్రకటించాయి.

ఛాతి సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో సోనియా

Advertisement

సోనియా గాంధీకి అస్వస్థత సమాచారంపై ఆస్పత్రి వర్గాలు స్పందిస్తూ… ఇది రొటీన్ చెకప్ అని.. దగ్గు తీవ్రం కావడంతో సోనియాను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దని పేర్కొన్నారు. ఛాతి సంబంధిత వైద్య నిపుణులు పర్యవేక్షణలో సోనియా చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

 

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×