E-Paper
Advertisement

Varanasi: ధురంధర్’ రికార్డులు జుజుబీ.. రాజమౌళి ‘వారణాసి’ వస్తే బాలీవుడ్ బచ్చానే!

Varanasi: ధురంధర్’ రికార్డులు జుజుబీ.. రాజమౌళి ‘వారణాసి’ వస్తే బాలీవుడ్ బచ్చానే!
Advertisement

Varanasi: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న హడావుడి చూసి బాలీవుడ్ వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. మూడు రోజుల్లో 500 కోట్లు, వారం తిరగకముందే 1000 కోట్లు అంటూ ఊదరగొడుతున్నారు. అయితే, ఈ ‘ధురంధర్’ ప్రతాపం అంతా రాజమౌళి – మహేష్ బాబుల ‘వారణాసి’ థియేటర్లలోకి అడుగుపెట్టే వరకే! జక్కన్న వెండితెరపై తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెడితే, ఈ 1000 కోట్ల రికార్డులు చిత్తు కాగితాల్లా గాలిలో కలిసిపోవడం ఖాయం.

ధురంధర్ రికార్డులు.. ఏడాది ముచ్చటే!
రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ కుర్రాళ్ళను ఊపేస్తుండొచ్చు కానీ, రాజమౌళి సినిమా అంటే అది ఒక ఎమోషన్. వచ్చే ఏడాది వేసవిలో ‘వారణాసి’ ల్యాండ్ అయితే, ధురంధర్ సెట్ చేసిన ఏ టార్గెట్ అయినా మహేష్ బాబుకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే ధురంధర్ ఓవరాల్ రికార్డులను వారణాసి తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ముందు బాలీవుడ్ స్పై యూనివర్స్ అన్నీ ‘జుజుబీ’ అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Advertisement

రామాయణానికే లేని రీచ్.. వారణాసికి సాధ్యమా?
ఈ ఏడాది భారీ అంచనాలతో రాబోతున్న ‘రామాయణం’ సినిమా కంటే, ‘వారణాసి’పైనే వరల్డ్ వైడ్ గా ఎక్కువ బజ్ ఉంది. పాన్-ఇండియా కాదు, ఇది ‘పాన్-వరల్డ్’ సినిమా! కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి సినిమా ప్రేమికుడు మహేష్ బాబును రాజమౌళి ఫ్రేమ్ లో చూడాలని తహతహలాడుతున్నాడు. ధురంధర్ కు కేవలం నార్త్ బెల్ట్ లోనే ఎక్కువ హైప్ ఉంటే, వారణాసి మాత్రం గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో మహేష్ బాబు సృష్టించే ప్రభంజనం ముందు రణ్‌వీర్ సింగ్ నంబర్స్ చాలా ‘మిడ్’ (Mid) గా అనిపించడం ఖాయం.

రికార్డుల వేటలో ‘అసలైన చాలెంజ్’ వారణాసికే!
ధురంధర్ సినిమాకు టికెట్ల రేట్లు, హైప్ అన్నీ కలిసొచ్చినా.. వారణాసి రేంజ్ రీచ్ దానికి లేదనేది పచ్చి నిజం. రాజమౌళి సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ చూసి బాలీవుడ్ మేకర్స్ బెంబేలెత్తిపోతున్నారు. వారణాసి సినిమాకు ఒకవేళ ‘యావరేజ్’ టాక్ వచ్చినా సరే, అది ధురంధర్ లైఫ్ టైమ్ కలెక్షన్లను వారం రోజుల్లోనే దాటేస్తుంది. అసలైన బాక్సాఫీస్ యుద్ధం రాజమౌళి – మహేష్ బాబు బరిలోకి దిగినప్పుడే మొదలవుతుంది. అప్పటిదాకా ధురంధర్ టీమ్ ఈ చిన్నపాటి రికార్డులతో సంబరాలు చేసుకోవాల్సిందే!

Advertisement

బాలీవుడ్ ఎంత ఎగిరెగిరి పడినా, ఇండియన్ సినిమా కింగ్ మేకర్ రాజమౌళి అని ‘వారణాసి’ మరోసారి ప్రూవ్ చేయబోతోంది. ధురంధర్ 2 సృష్టించిన ఈ 1000 కోట్ల బెంచ్ మార్క్, మహేష్ బాబుకి కేవలం ఒక చిన్న ‘మైలురాయి’ మాత్రమే. మరి ఈ భారీ యుద్ధంలో గెలిచేది ఎవరో, రికార్డులు తిరగరాసేది ఎవరో చూడాలి!

also read:Rajasekhar Career: రాజశేఖర్ ‘యాంగ్రీ’ పాత్రలకు ఇక సరిపోరా? తండ్రి పాత్రలే బెటరా?

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×