E-Paper
Advertisement

Khammam Farmers: బడ్జెట్ లో సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించాలి.. ఆ జిల్లాలో రైతుల భారీ నిరసన

Khammam Farmers: బడ్జెట్ లో సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించాలి.. ఆ జిల్లాలో రైతుల భారీ నిరసన
Advertisement

Khammam Farmers:  ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఏడు లక్షల ఎకరాల కు సాగు నీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన 11 వేల కోట్ల రూపాయల నిధుల్లో 2026-27 ఆర్థిక బడ్జెట్ లో కేటాయించాలి. అని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులకు పరిహారం అందించాలి అని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ రైతులు భారీ నిరసన నిర్వహించారు.

Also Read: Collector Haimavathi: గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి.. ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ హైమావతి సూచన

ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధి ఉందా? 

Advertisement

ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ రంగం కు నిధులు కేటాయింపులు తక్కువ చేయుడం, సీతారామ ప్రాజెక్టు కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం దారుణం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం లో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు 11 వేల కోట్ల రూపాయలు అంచనా వేసి రాష్ట్ర బడ్జెట్లో మాత్రం గత సంవత్సరం కేటాయింపులు 699 కోట్ల రూపాయల ఉంటే ఈ బడ్జెట్లో కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం ప్రాజెక్టు పూర్తి చేయుటకు ప్రభుత్వం కు ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతుంది అని అన్నారు.

నిధులు కేటాయింపులు పెంచాలి

వ్యవసాయ రంగంకు కూడా గత బడ్జెట్ కంటే నిధులు కేటాయింపులు తక్కువ చేశారు అని బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు కేటాయింపులు పెంచాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సినీయర్ నాయకులు ఇంజం నాగభూషణం, అంబటి శ్రీనివాస్ రెడ్డి బాదావత్ శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రాయల సత్యనారాయణ, కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు, నిర్వాసితుల సంఘం నాయకులు షేక్ షరిఫ్, అర్జ రమేష్, గడ్డం వీరన్న, వెంకట్రామిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, సింగం వెంకన్న, బాలాజీ,  వెంకటేశ్వరరావు,సేటియా నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Item Songs: ఐటెం సాంగ్‌తో ఇమేజ్ డ్యామేజ్..?కోట్ల ఆఫర్లను కాదంటున్న స్టార్ హీరోయిన్లు!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×