E-Paper
Advertisement

Rajasekhar Career: రాజశేఖర్ ‘యాంగ్రీ’ పాత్రలకు ఇక సరిపోరా? తండ్రి పాత్రలే బెటరా?

Rajasekhar Career: రాజశేఖర్ ‘యాంగ్రీ’ పాత్రలకు ఇక సరిపోరా? తండ్రి పాత్రలే బెటరా?
Advertisement

Rajasekhar Career: టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కెరీర్ ఇప్పుడు ఒక కీలకమైన, అలాగే అభిమానులకు కాస్త మింగుడుపడని మలుపు తిరిగింది. ఒకప్పుడు వెండితెరపై పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, సోలో హీరోగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాజశేఖర్, ఇప్పుడు ‘క్యారెక్టర్ ఆర్టిస్ట్’గా మారక తప్పని పరిస్థితికి వచ్చారు. శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ సినిమాతో ఆయన తండ్రి పాత్రలో రీఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరోగా మార్కెట్ క్లోజ్ అయిపోవడంతోనే రాజశేఖర్ ఈ ‘సెకండ్ ప్లేస్’కి ఫిక్స్ అయ్యారా అన్న చర్చ మొదలైంది.

ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్‌కు.. రాజశేఖర్ ఓపెన్ కామెంట్స్!
‘బైకర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అసహనాన్ని, ఇన్ సెక్యూరిటీని బయటపెట్టాయి. “ఇది శర్వానంద్ సినిమా అని అందరూ అంటుంటే.. నేను ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్‌కి పడిపోయానా అనిపించింది” అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంటే, మనసులో ఇంకా హీరోగా చేయాలనే కోరిక ఉన్నా, బయట మార్కెట్ లేకపోవడంతోనే అయిష్టంగా ఈ తండ్రి పాత్రకు ఓకే చెప్పారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. భార్య జీవిత, పిల్లలు ఒత్తిడి చేయబట్టే ఈ పాత్ర ఒప్పుకున్నానని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం.

Advertisement

రెండేళ్ల ఖాళీ.. కథలు లేకనా? క్రేజ్ లేకనా?
గత రెండు మూడు ఏళ్లుగా రాజశేఖర్ వెండితెరపై కనిపించలేదు. ఎన్నో కథలు విన్నాను అని చెబుతున్నా, అసలు ఆయన రేంజ్‌కు తగ్గ హీరో కథలు ఎవరూ తీసుకురావడం లేదనేది చేదు నిజం. ‘గరుడవేగ’తో చిన్న ఆశ చిగురించినా, ఆ తర్వాత వచ్చిన ‘శేఖర్’ డిజాస్టర్ అవ్వడంతో రాజశేఖర్ సోలో హీరో మార్కెట్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇప్పుడు ‘బైకర్’లో శర్వానంద్‌కు తండ్రిగా నటించడం అంటే, ఆయన తన ఇమేజ్‌ను తగ్గించుకోవడమేనని సీనియర్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్.. ఇక ‘క్యారెక్టర్’ వేట మొదలైంది!
ఈ ఈవెంట్‌లో రాజశేఖర్ డైరెక్టర్లకు, నిర్మాతలకు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. “ఇకపై నేను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ.. నన్ను సంప్రదించండి” అని చెప్పడం చూస్తుంటే, ఆయన ఇక హీరోగా తన టైమ్ అయిపోయిందని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. జగపతి బాబు బాటలో విలన్ గానో, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానో సెటిల్ అవ్వడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యారు. కానీ, రాజశేఖర్ లాంటి ఈగో ఉన్న నటుడు సెట్స్ లో ఇతర హీరోల కింద ఎలా పని చేస్తారు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

Advertisement

యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్, శర్వానంద్ లాంటి క్రేజీ హీరో ఉన్న ‘బైకర్’ సినిమా రాజశేఖర్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా? లేక ఆయనను కేవలం ‘సపోర్టింగ్ యాక్టర్’గానే ముద్ర వేస్తుందా? అనేది ఏప్రిల్ 3న తేలిపోనుంది. మొత్తానికి ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఇమేజ్ పక్కన పెట్టి ‘యాంగ్రీ ఓల్డ్ మ్యాన్’గా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి!

also read:Mangli Controversy: మంగ్లీకి ‘మైక్రో’ సెగ! సింగర్ పేరుతో కోట్లలో వసూళ్లు..అసలు గుట్టు ఇదేనా!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×