E-Paper
Advertisement

పెద్దికి బయపడ్డ మహేష్ బాబు సినిమా !

పెద్దికి బయపడ్డ మహేష్ బాబు సినిమా !
Advertisement

Rao Bahadur : వారణాసి సినిమా ఇప్పట్లో లేదు..మరింతకీ పెద్దికి బయపడ్డ మహేష్ బాబు సినిమా ఏమై ఉంటుంది అనుకుంటున్నారా. హీరోగా కాదు కాని మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘రావు బహదూర్’జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది.కానీ పెద్ది సినిమా జూన్ 4 వస్తానని అనౌన్స్ చేసేయడంతో వచ్చి రిస్క్ చేయలేమంటూ సినిమాని వెనక్కి నెట్టేశారట.అయితే సరిగ్గా ఒకరోజు గ్యాప్ లో రావాల్సిన ‘రావు బహదూర్’ ఏకంగా నాలుగు వారాల పాటు వెనక్కి వెళ్లిపోవడం ఇక్కడ ఆశ్చర్యం.పైగా GMB లాంటి బడా బ్యానర్ తో మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ సపోర్ట్ ఉన్నా, .. కంటెంట్ మీద నమ్మకం లేకే ఇలా డేట్ మార్చారా అంటూ ట్రోల్స్ అప్పుడే మొదలైపోయాయ్.

ఆడియన్స్ కు ఏమాత్రం కనెక్ట్ అవుతుందో

Advertisement

ఇక వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పోస్టర్లు చూస్తుంటే ఏదో తేడా కొడుతోందనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్. సత్యదేవ్ ఏజ్ పైబడ్డ వాడిగా ఒంటి నిండా ముత్యాల హారాలతో కనిపిస్తున్న రాయల్ లుక్ ఆడియన్స్ కు ఏమాత్రం కనెక్ట్ అవుతుందో అన్నది పెద్ద ప్రశ్న.పైగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ల మీద “అనుమానం పెనుభూతం” అని క్యాప్షన్ ఉంది.

బహుశా సినిమా రిజల్ట్ మీద కూడా మేకర్స్‌కు అదే అనుమానం ఉందేమో అని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు. ఇక షూటింగ్ ఎప్పుడో పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా రోజుల నుండి పడి ఉన్న ఈ సినిమాని ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలేదో మేకర్సే చెప్పాలి. మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ షూటింగ్ లో బిజీగా ఉండి సొంత ప్రొడక్షన్ లో వస్తున్న సినిమాను లైట్ తీసుకున్నాడా అన్న టాక్ కూడా వినిపిస్తుంది.

Advertisement

also read :అమీర్ ఖాన్ చేతిలో మరో ‘క్లాసిక్’.. ‘లగాన్’ మ్యాజిక్ మళ్ళీ సాధ్యమేనా?

సోలో రిలీజ్ దొరుకుతుందా

అయితే జూన్ నెలలో చాలా సినిమాలు ఖర్చీఫ్ లతో రెడీ గా ఉండటంతో రిస్క్ అని జులైకి మారారు సరే.కానీ జూలై 3న అయినా ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరుకుతుందా అంటే అనుమానమే.ఇక ఇలాగే సినిమా వాయిదాల పాట పాడుకుంటూ పొతే మాత్రం సినిమాపై ఉన్న ఆ కాస్త ఇంట్రెస్ట్ కూడా పోవడం ఖాయం. ఒకవైపు రామ్ చరణ్ ‘పెద్ది’ ఎటాక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ సమయంలో వెనక్కి వెళ్ళిపోవడం అంటే భయపడినట్టే అని కొందరంటుంటే, పెద్ది కి ఎదురెళ్ళి రిస్క్ లో పడటం కన్నా సోలోగా వచ్చి డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకోవడం బెటర్ అన్నది మరికొందరి మాట.

బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేద్దామనుకున్న సత్యదేవ్

ఏది ఏమైనా మహేష్ బాబు బ్రాండ్ వాడుకుని బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేద్దామని చూస్తున్న సత్యదేవ్ టీమ్ కి, ఈ పోస్ట్ పోన్ డిసీషన్ డైజెస్ట్ కానిదే. మహేష్ బాబు నిర్మాణంలో ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పార్టనర్ షిప్ లో వస్తున్న ఈ సినిమా సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ కన్ఫ్యూజన్ ఏర్పడుతుందన్నది అర్థమవుతుంది.చూడాలి మరి అన్నట్టుగా జూన్ 5కైనా వస్తారా లేక మరేదైనా సాకుతో మరింత వెనక్కి వెళ్తారా !

also read :దృశ్యం3 ట్రైలర్ ఎలా ఉందంటే ..

 

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×