E-Paper
Advertisement

అమీర్ ఖాన్ చేతిలో మరో ‘క్లాసిక్’.. ‘లగాన్’ మ్యాజిక్ మళ్ళీ సాధ్యమేనా?

అమీర్ ఖాన్ చేతిలో మరో ‘క్లాసిక్’.. ‘లగాన్’ మ్యాజిక్ మళ్ళీ సాధ్యమేనా?
Advertisement

Lala Amarnath : కొన్ని సినిమాలు వస్తాయి, పోతాయి. కాని మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సుల్లో పాతుకుపోతాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటి లగాన్. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన జూన్ 15, 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అటు బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాదు, ఆస్కార్ ముంగిట్లోకి వెళ్లి ఇండియన్ మేకర్స్ సత్తాని ప్రపంచానికి ఘనంగా చాటింది. మరి అలాంటి క్రేజీ కాంబోలో మళ్ళీ సినిమా రావాలని ఎవరు కోరుకోరు. అదిగో ఆ కోరికనే పాతికేళ్ళ తర్వాత మరోసారి తీర్చేందుకు రెడీ అవుతుందంట అమీర్ – అశుతోష్ కాంబో.

లాలా అమర్‌నాథ్ బయోగ్రఫీ

Advertisement

ఇక వీరిద్దరూ ఎప్పటిలాగే తమకి అచ్చొచ్చిన క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. అవును.. ఇండియన్ క్రికెట్ కి ఎన్నో సేవలందించి, భారత క్రికెట్ పితామహులలో ఒకరిగా నిలిచిన లాలా అమర్‌నాథ్ బయోగ్రఫీని సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కించే ప్లాన్ వేస్తుందట ఈ జోడీ. అంటే ‘లగాన్’లో ఫిక్షన్ క్రికెట్ తో అలరించిన వీరిద్దరూ ఇపుడు రియల్ లైఫ్ హిస్టరీతో మెప్పించబోతున్నారన్న మాట.

also read :పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే కౌంటర్.. వైరల్ అవుతున్న పోస్ట్!

Advertisement

తొలి టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్

లాలా అమర్‌నాథ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో (1933లో ఇంగ్లాండ్ పై జింఖానా) తొలి టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేయడం ఒక విశేషమైతే, ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియన్ టీమ్ కి మొట్టమొదటి కెప్టెన్ గా వ్యవహరించడం మరో విశేషం. అలాంటి అద్భుత ఆటగాడి పాత్రని అమీర్ పోషిస్తుండటం ఇపుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో లాలా 1947 ఇండియా డివైడ్ అయినప్పుడు ఒక క్రికెటర్ గా ఎలాంటి పరిస్థితులని ఎదుర్కున్నాడు, అతడి మానసిక సంఘర్షణ ఎలా ఉండి ఉంటుంది అన్నదానిని కూడా డీటైల్డ్ గా సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నాడట అశుతోష్. అంటే ఒకవైపు లాలా క్రికెట్ గ్రౌండ్ లో చేసిన పోరాటం, మరోవైపు అదే సమయంలో జరిగిన దేశ విభజనతో ఏర్పడ్డ పరిస్థితులని కలగలపి సినిమాని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా తెరకెక్కించబోతున్నాడన్న మాట.

సిద్ధమవుతున్న మిస్టర్ పర్‌ఫెక్ట్!

ఇక అమీర్ ఏ సినిమా చేసినా అందులోకి దూరిపోతాడన్న సంగతి తెల్సిందే. అదే క్రమంలో లాలా బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్, క్రికెట్ లో ఆ సమయంలో ఉండే టెక్నిక్స్ అన్నీ నేర్చుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాడని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్పీడప్ అయిందని, ఇండిపెండెన్స్ వచ్చిన కాలం నాటి వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా భారీ సెట్స్, లొకేషన్ల వేటలో మూవీ టీమ్ ఉందని తెలుస్తుంది. ఇక బీ టౌన్ టాక్స్ ప్రకారం సినిమా సెప్టెంబర్ 2026లో సెట్స్ పైకి వెళ్లనుందట. చూడాలి మరి పాతికేళ్ళ తర్వాత మరోసారి జట్టు కట్టబోతున్న ఈ జోడీ అలనాటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేస్తుందో లేదో !

also read :‘గేట్లు మూయండిరా’.. నాగ్ 100వ సినిమా లీక్డ్ సీన్స్ చూశారా?

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×