E-Paper
Advertisement

#Globe Trotter: ఫ్యాన్స్ కి మహేష్ బాబు రిక్వెస్ట్..వీడియో వైరల్!

#Globe Trotter: ఫ్యాన్స్ కి మహేష్ బాబు రిక్వెస్ట్..వీడియో వైరల్!
Advertisement

#Globe Trotter:ఇన్ని రోజులు టాలీవుడ్ కే పరిమితమై.. ప్రేక్షకులను అలరించి సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు (Maheshbabu ) తొలిసారి పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamoulu ) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం SSMB 29. భారీ అంచనాల మధ్య 2027లో విడుదల కాబోతోంది. అయితే అంతకాలం ఈ సినిమా నుంచి అప్డేట్ లేకపోతే అభిమానులు సినిమాపై అంచనాలు పెట్టుకోరు అనే కారణంతోనే రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నారు.

ఘనంగా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్..

ఈ క్రమంలోనే హైదరాబాదు వేదికగా రామోజీ ఫిలింసిటీలో గ్లోబ్ ట్రోటర్ అంటూ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 15న అంటే శనివారం సాయంత్రం దాదాపు లక్షమంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో ఎస్ ఎస్ ఎం బి 29కి సంబంధించిన గ్లింప్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే లక్ష మంది సమక్షంలో జరగబోయే ఈవెంట్ అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ లక్ష మందిని కంట్రోల్ చేయాలి అంటే పోలీసులకు అది అతిపెద్ద సవాల్ అని చెప్పాలి. అందుకే అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు మహేష్ బాబు.

అభిమానులను రిక్వెస్ట్ చేసిన మహేష్ బాబు..

Advertisement

విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే ఈ లైవ్ ఈవెంట్ కి సంబంధించి పాస్ లను ఇప్పటికే జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని ఎలా ఉపయోగించాలి అనే విషయంపై మహేష్ బాబు అవగాహన కల్పిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..” నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీ లో జరగబోయే ఈవెంట్ కి ఆర్ఎస్ మెయిన్ గేట్లు క్లోజ్ చేసి ఉంటాయి. మీతో పాసెస్ ఉంటేనే అది. అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది.. దాన్ని స్కాన్ చేస్తే మీకు అసైన్ చేసిన గేట్ ఎంట్రీ చూపిస్తుంది. దాని ద్వారానే మీరు ఈవెంట్లోకి ఎంట్రీ ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. పోలీస్ వాళ్లకు, ఆన్ రోడ్ సర్వీస్ వారికి సపోర్ట్ చేయండి.

ALSO READ:AR Rahman: కొత్త ప్రయాణం మొదలెట్టిన రెహమాన్ కూతురు.. తొలి ప్రదర్శన ఎక్కడంటే?

ఇలాంటి ఈవెంట్లు మరెన్నో..

Advertisement

పోలీస్ వారు మనకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే.. ఈవెంట్ కి తక్కువ వెహికల్స్ వస్తే.. అందరికీ అంత సులభంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడమే కాదు సేఫ్ గా మళ్లీ మనం మన గమ్యాలకు చేరుకోవాలి. పాసెస్ లేని వాళ్ళు తొందరపడి ఈవెంట్ కు రాకండి. ఇంకా ఎన్నో ఈవెంట్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి” అంటూ చెప్పి అభిమానులను రిక్వెస్ట్ చేయడమే కాకుండా.. ఎన్నో ఈవెంట్లు జరుగుతాయని చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేశారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .మొత్తానికి అయితే ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయని చెప్పడంతో వచ్చే ఈవెంట్స్ కోసం కూడా అభిమానులు అప్పుడే ఎదురు చూడటం మొదలుపెట్టారు.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×