Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 51 శాతం ఓట్లు వేసి విలక్షణమైన తీర్పు ఇచ్చారని, ఇది తమ రెండు సంవత్సరాల ప్రజా ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదంగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ గెలుపునకు కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు, మమ్మల్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం, ప్రభుత్వంలో ఉంటే వాటిని పరిష్కరిస్తాం. అందుకే శతాబ్దానికి పైగా కాంగ్రెస్ ప్రజల మధ్య మనుగడ సాధిస్తోంది.” అని అన్నారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రజలు తమ పాత్ర ఏంటో ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫేక్ సర్వేలు, పెయిడ్ ఆర్టికల్స్, విష ప్రచారం, అసభ్యకరమైన భాషపై ఆధారపడి ప్రభుత్వాన్ని అవమానించే ప్రయత్నం చేసింది. నగరంలో డ్రగ్స్, గంజాయిని అణచివేయడానికి ‘ఈగల్ ఫోర్స్’ తెస్తే, చెరువులు-నాలాల కబ్జాలను అరికట్టడానికి ‘హైడ్రా’ను తీసుకొస్తే.. ప్రతిపక్షం వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.” అని మండిపడ్డారు. “మూసీ ప్రక్షాళన చేసి, అక్కడి పేదలకు మంచి వసతులు, ఉపాధి కల్పించాలని మేము ప్రయత్నిస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు ప్రతి నిమిషం అడ్డుపడుతున్నారు.” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేటీఆర్ తనకన్నా వయసులో చిన్నవారని, తన అహంకారాన్ని తగ్గించుకోవాలని సీఎం సూచించారు. తాము తెలంగాణ నలుమూలల తిరిగితేనే కాంగ్రెస్ కు 65 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. ‘‘అసెంబ్లీ లో కూర్చుని హరీష్ రావు మా వైపు అసూయగా చూస్తారు. KTR కు ఇంకా అహంకారం తగ్గలేదు అని ప్రజలే చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి. BRS పార్టీ ఓడుతుందని బీజేపీ డిపాజిట్ లాక్ అవుతుందని.. మీట్ ది ప్రెస్ లో కూడా నేను చెప్పాను. కొన్ని మీడియా ఛానెల్స్ డబ్బుల కోసం పెయిడ్ ఆర్టికల్స్ స్ప్రెడ్ చేయకూడదు. మిగతా రాష్ట్రాల్లో చేసినట్లుగా ఛానెల్స్ ను కనిపించకుండా చెయ్యడం ఒక్క నిమిషం పని. BRS ను ఇంకా బ్రతికించాలని చూస్తున్నాయి కొన్ని మీడియా ఛానెల్స్.’’ అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ పై ఆడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ స్పందిస్తూ.. క్రియ శీలక రాజకీయాల్లో కేసీఆర్ లేరన్నారు. ఆయన క్రియాశీలక రాజకీయల్లోకి వచ్చినప్పుడు తాను వారిపై స్పందిస్తానని అన్నారు. KCR ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉందన్న రేవంత్.. కేసీఆర్ కుర్చీ కోసం కేటీఆర్, హరీష్ కొట్టుకుంటున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. “రాష్ట్రానికి 60-65% ఆదాయం ఈ జంట నగరాల నుంచే వస్తోంది. ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్రంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు నిలయంగా మార్చాలని మేము ప్రయత్నిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు రాబట్టడంలో కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఆయన అడ్డు తగులుతున్నారు,” అని అన్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ బాధ్యతను గుర్తించి, నగర అభివృద్ధికి సహకరించాలని సీఎం హితవు పలికారు. ఈ గెలుపుతో వచ్చిన సానుకూల పవనాలు (పాజిటివ్ వేవ్) రాబోయే జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగుతాయని, మూడేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ 100కు పైగా సీట్లు గెలుస్తుందని అంతకుముందు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన..
పార్టీల వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చి తీర్పు ఇచ్చారు
ఈ తీర్పుతో ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి బాధ్యత ఏమిటి అన్నది విస్పష్టం
హైదరాబాద్ నగరాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పని చేస్తున్నాం
జంట… pic.twitter.com/55J6eW9GUH
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
Read Also: Kavitha: జూబ్లీహిల్స్ ఓటమిపై కవిత ట్వీట్.. కర్మ హిట్స్ బ్యాక్.. అన్నకు కవిత కౌంటర్!