Gautham On The Paradise: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కుమారుడు గౌతమ్ గట్టమనేని(Gautham Ghattamaneni) త్వరలోనే హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు తగ్గ శిక్షణ కూడా గౌతమ్ తీసుకుంటున్నారు. ఇకపోతే గౌతమ్ 20 ఏళ్ల వయసు రాగానే తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తన లెటర్‌బాక్స్‌డ్ ఐడీని చేర్చడంతో ఇది కాస్త చర్చలకు కారణమైంది. ఇకపోతే ఇటీవల వరుసగా గౌతమ్ ఘట్టమనేని టాలీవుడ్ హీరోల సినిమాలకు పెద్ద ఎత్తున రివ్యూ ఇస్తున్నారు. ఇక ఇటీవల హీరో యశ్ నటించిన టాక్సిక సినిమాకు ఈయన జీరో పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
గౌతమ్ గట్టమనేని నటుడు నాని (Nani)నటించిన ది ప్యారడైజ్ (The Paradise)సినిమా చూసిన అనంతరం ఈ సినిమాకు దారుణమైన రేటింగ్ ఇవ్వడంతో మరోసారి గౌతం వార్తలలో నిలుస్తున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ది ప్యారడైజ్ సినిమా చూసిన గౌతమ్ ఈ సినిమా తనకు నచ్చలేదంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం నాని జెర్సీ సినిమాకు తాను పెద్ద అభిమాని అని చెప్పిన గౌతమ్ ప్యారడైజ్ సినిమా మాత్రం తనకు నచ్చలేదని తెలిపారు.
ది ప్యారడైజ్ సినిమా కోసం గౌతమ్ గట్టమనేని కేవలం ఒక స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు అనంతరం ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ది ప్యారడైజ్ సినిమాటోగ్రఫీ, ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా నచ్చాయని తెలిపారు. ఇంతకుమించి ఈ సినిమాలో మరి ఏమి నచ్చలేదని, ఎడిటింగ్ దారుణంగా ఉందని ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది అంటూ గౌతమ్ ఈ సినిమాకు రివ్యూ కూడా ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గౌతమ్ ఇచ్చిన ఈ రివ్యూ పట్ల సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి గౌతమ్ చాలా జినైన్ గా రివ్యూ ఇచ్చారు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు నాని అభిమానులు మాత్రం కాస్త విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే గౌతమ్ తన తండ్రి మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలకు కూడా ఏకంగా ఒకటి రెండు స్టార్ లు రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన సినిమా చూసి సినిమా పట్ల తన అభిప్రాయాలను ఎలాంటి పక్షపాతం లేకుండా తెలియజేస్తున్నారని తెలుస్తుంది. ఇక గౌతమ్ ప్రస్తుతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం కోసం విదేశాలలో శిక్షణ తీసుకుంటున్నారని అతి త్వరలోనే గౌతమ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
Also Read: ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!