E-Paper
Advertisement

Mahesh Babu: వారణాసి వెనకున్న నిశ్శబ్దపు శక్తి ఇతడే.. కార్తికేయకు మహేష్‌ భారీ ఎలివేషన్‌

Mahesh Babu: వారణాసి వెనకున్న నిశ్శబ్దపు శక్తి ఇతడే.. కార్తికేయకు మహేష్‌ భారీ ఎలివేషన్‌
Advertisement

Mahesh Babu Birthday Wishes to SS Karthikeya: ఎస్‌ఎస్‌ కార్తికేయ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిగ్గజ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి కొడుకైన కార్తికేయ అతి చిన్న వయసులోనే నిర్మాతగా రాణిస్తున్నాడు. నేడు ఈ యంగ్‌ ప్రొడ్యూసర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కార్తికేయలకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు కూడా కార్తికేయకు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. ఈ మేరకు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ కార్తికేయ ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చాడు. అంతేకాదు కార్తికేయ పనితీరు చూస్తే తనకు చాలా ఆశ్చర్యం వేస్తుందంటూ మహేష్‌ రాసుకొచ్చాడు.

తండ్రి సినిమాలకు బ్యాక్‌ బోన్‌ లా..

కార్తికేయ తెరపై కనిపించడం చాలా అరుదు. అతడి పేరు కూడా పెద్దగా వినిపించదు. కానీ, ఒక సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి దానికి ప్యాకప్‌ చెప్పి థియేటర్లలోకి వచ్చేవరకు అంత తానై చూసుకుంటూ తండ్రి రాజమౌళి తెరకెక్కించే సినిమాలన్నింటికీ బ్యాక్‌ బోన్‌గా ఉంటాడని చాలా తక్కువ మందికి తెలుసు. రాజమౌళి సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి రిలీజ్‌ అయ్యే వరకు ఉండే ప్రతి ఈవెంట్‌ని అన్ని దగ్గరుండి చూసుకుంటూ తండ్రికి బలమైన సపోర్టుగా ఉంటాడు. తన తండ్రి పాన్‌ ఇండియా చిత్రాల నిర్మాణం వెనుక అతడి కృషి ఎంత ఉంటుందనేది ఆ సినిమా హీరోలకు, యూనిట్‌ కే బాగా తెలుసు. సెట్‌ అరెంజ్‌మెంట్స్‌ మాత్రమే కాదు.. సెట్స్ హీరోలు, నటీనటులు టైం వచ్చేలా చూసుకునేది కూడా కార్తికేయనే. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ టైంలో ఎన్టీఆర్‌ తలపట్టుకుని మరి చెప్పాడు.

నిశ్చబ్దపు శక్తి నువ్వే..

Advertisement

సినిమా షూటింగ్, ప్లేస్, ఏ టైంకి రావాలి, ఎప్పుడు వెళ్లాలని, ప్రతిది దగ్గరుండి చూసుకుంటాడని, రాజమౌళి ప్లాన్ చేస్తే దాన్ని తూ.చ పాటిస్తూ షూటింగ్ అంత సాఫీగా అయ్యేలా చూసుకుంటాడట. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్స్‌ టైంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు కార్తికేయ గురించి అదే చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వారణాసి విషయంలోనూ కార్తికేయ సపోర్టు ఎంత ఉందో స్వయంగా సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు వివరించాడు. కార్తికేయకు పుట్టిన రోజు శుభకాంక్షలు చెబుతూ.. సింగిల్‌ వర్డ్‌లో వారణాసికి అతడుఎంత ముఖ్యమో వెల్లడించాడు. ‘మేము నిర్మించే ప్రతిదాని వెనుక ఉన్న నిశ్శబ్ద మనిషి. హ్యాపీ బర్త్‌ డే కార్తికేయ. ఎంతో కష్టం అనుకున్న ప్రతి దాన్ని నువ్వు ఈజీ చేసి ఆశ్చర్యపరుస్తుంటావు. ఈ సంవత్సరమంత మీకు మరింత అద్భుతంగా ఉండాలని, ఎన్నో విజయాలు కలగాలని కోరుకుంటున్నా’ అంటూ మహేష్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

వారణాసి నిర్మాత కూడా

Advertisement

ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక ఏకంగా మహేష్‌ బాబు కార్తికేయను పోగడంతో అతడు హాట్‌ టాపిక్‌ అయ్యాడు. వారణాసి సినిమా నిర్మాణంలో కార్తికేయ బ్యాక్‌ బోన్‌ లాంటి వాడంటూ కార్తికేయకు ఎలివేషన్‌ ఇచ్చిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా కార్తికేయకు బర్త్ డే విషెస్ తెలిపింది. కార్తికేయతో డ్యాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ.. “ప్రశాంతంగా ఉండు మిత్రమా! కోటను నిశ్శబ్దంగా పట్టుకున్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే కార్తికేయ. ఈ సినిమా వల్ల మీతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది” అంటూ రాసుకొచ్చింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×