E-Paper
Advertisement

GlobeTrotter Event : మహేష్ బాబు ఎమోషనల్, నాన్నగారు చెప్పిన పని చేయలేదు

GlobeTrotter Event : మహేష్ బాబు ఎమోషనల్, నాన్నగారు చెప్పిన పని చేయలేదు
Advertisement

GlobeTrotter Event : సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే బాల నటుడిగానే తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నాడు మహేష్ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించేవాడు. ఆరోజుల్లోనే మహేష్ బాబుకు సినిమాలు అంటే విపరీతమైన డెడికేషన్ ఉండేది. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో కృష్ణ కూడా చెబుతూ ఉండేవాళ్ళు.

మహేష్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న తరుణంలో కూడా ఏ సినిమా ఎలా చేశావు. ఏ సినిమా సక్సెస్ ఎలా ఉండబోతుంది అని ముందుగానే అంచనా వేసి మహేష్ బాబుకి చెబుతూ ఉండే వాళ్ళు కృష్ణ. మహేష్ బాబు కి సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రత్యేకమైన ఇష్టం అని కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా పలు సందర్భాల్లో స్టేజ్ పైన సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తావన లేకుండా మహేష్ బాబు స్పీచ్ ఇవ్వరు.

మహేష్ బాబు ఎమోషనల్ 

Advertisement

ఈ ఈవెంట్ లో మహేష్ బాబు చాలాసార్లు ఎమోషనల్ అయిపోయారు. ఎస్.ఎస్ రాజమౌళి మాట్లాడుతూ నేను సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆయన టెక్నాలజీని పరిచయం చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని రాజమౌళి మాట్లాడుతుండగానే మహేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

ఇకపోతే మహేష్ బాబు మాట్లాడుతూ నాన్నగారు నాకు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాళ్ళు. నాన్నగారు చెప్పిన చాలా మాటలను నేను విన్నాను. నాన్నగారు నన్ను ఒక పౌరాణిక సినిమా చేయమన్నారు. కానీ నేను చేయలేదు నువ్వు కొన్ని వేషాలు లో చాలా బాగుంటావు రా అని చెప్పేవారు నేను ఎప్పుడు దానిని వినలేదు.

కోరిక నెరవేరినట్లే 

Advertisement

ఇప్పుడు నాన్నగారు మనమధ్య లేరు. నేను మాట్లాడే మాటలను నాన్నగారు వింటారు అని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పాడు మహేష్. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి స్పీచ్ లోనే మహేష్ బాబు రాముడు పాత్రలో కనిపించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

మొదటిసారి రాముడు పాత్ర వేసినప్పుడు మహేష్ ఎలా ఉంటాడో అని ఆలోచించేవారట రాజమౌళి. కృష్ణుడు పాత్రకి అయితే సరిగ్గా సరిపోతాడు అని అనుకునేవారు. ఒక్కసారి మహేష్ బాబుని రాముడు గెటప్ లో చూసిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళికి గూస్ బంప్స్ వచ్చాయి. ఇదే విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు అయితే కొన్ని రోజులు పాటు మహేష్ బాబు రాముడు వేషంలో ఉన్న ఫోటోని వాల్ పేపర్ గా కూడా పెట్టుకున్నారట ఎవరైనా చూస్తే మళ్ళీ బాగోదు అని తీసేసాను అని రాజమౌళి చెప్పారు.

Also Read: GlobeTrotter Event : గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో నిరాశ, మేనేజ్ చెయ్యలేక సారీ చెప్పేసారు 

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×