E-Paper
Advertisement

Mahesh Babu: కెరియర్ మొదట్లోనే టాప్ డైరెక్టర్లను భయపెట్టిన రామ్ చరణ్, మహేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

Mahesh Babu: కెరియర్ మొదట్లోనే టాప్ డైరెక్టర్లను భయపెట్టిన రామ్ చరణ్, మహేష్ బాబు.. ఎందుకో తెలుసా..?
Advertisement

Mahesh Babu and Ram Charan ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఫస్ట్ మూవీ దగ్గరే అన్నీ నిర్ణయమవుతాయి. హీరోకు టాలెంట్ ఉన్నా, ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు డైరెక్టర్లకు మాత్రం భయం మొదలవుతుంది.
మన వల్ల ఆ అంచనాలు రీచ్ అవుతాయా?..అనే సందేహమే కొందరు టాప్ డైరెక్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది. అలాంటి ఆసక్తికరమైన రెండు ఉదాహరణలే మహేష్ బాబు మరియు రామ్ చరణ్ డెబ్యూ సినిమాలు.

ముందుగా మహేష్ బాబు విషయం తీసుకుంటే, ఆయన ఫస్ట్ మూవీకి మొదటగా దర్శకుడు కృష్ణవంశీ ని అడిగారు. కానీ అప్పటికే కృష్ణ గారి ఫ్యాన్స్ ఎలా ఉంటారో చూసిన ఆయన..ఏమాత్రం తేడా జరిగినా వారి ఒత్తిడిని తట్టుకోలేను. పైగా వారి అంచనాలు అందుకోవడం చాలా కష్టం.. అంటూ మొదటి సినిమాకు నో చెప్పారంట.
అయితే రెండో సినిమా మాత్రం తప్పకుండా చేస్తానని మాట ఇచ్చి తప్పుకున్నారు.

Advertisement

దీంతో నిర్మాత అశ్వినీదత్ మరికొందరు దర్శకులను ప్రయత్నించినా, వాళ్లూ అదే భయాన్ని వ్యక్తం చేశారు. చివరకు అనుభవం ఉన్న దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారే కరెక్ట్ అని నిర్ణయించారు. అలా మహేష్ బాబు డెబ్యూ మూవీగా రాజకుమారుడు తెరకెక్కింది.

ఇక రామ్ చరణ్ తొలి సినిమా విషయానికి వస్తే, మొదటగా దర్శకుడు శంకర్ పేరు వినిపించింది. కానీ మెగా ఫ్యాన్స్ ఇమేజ్, తన స్టైల్‌కు అది సెట్ అవుతుందో లేదో, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ సక్సెస్ అవుతుందో లేదో అనే భయంతో ఆయన డిలే చేశారు.

Advertisement

తర్వాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ని సంప్రదించగా, ఆయన కూడా మెగా ఫ్యాన్స్ అంచనాలు చాలా పెద్దవి. అవి రీచ్ కావాలంటే ముందు చరణ్ ఫస్ట్ మూవీ చూడాలి. రెండో సినిమా మాత్రం ఖచ్చితంగా చేస్తా.. అని చెప్పారు.

అలా చివరకు రామ్ చరణ్ తొలి సినిమా బాధ్యత పూరీ జగన్నాథ్ చేతికి వెళ్లింది. ఫలితంగా వచ్చిన మూవీనే చిరుత.

ఫ్యాన్స్ అంచనాలు డైరెక్టర్లను భయపెట్టినా, సరైన దర్శకుడు దొరికితే ఎలా బ్లాక్‌బస్టర్ డెబ్యూ సాధ్యమవుతుందో ఈ రెండు సినిమాలే బెస్ట్ ఉదాహరణలు. టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ డెబ్యూ మూవీలుగా ఇవి నిలిచిపోయాయి.

ALSO READ: Kapu vs Kamma: పచ్చి బూతులకు ‘కాపు’ కాస్తారా? అంబటి కోసం ఆయన వచ్చారండోయ్!

 

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×