Nizam Film Distribution: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హార్ట్ వంటి నైజాం ఏరియాలో ఇప్పుడో కొత్త మార్పు సంభవించబోతోంది. ఇప్పటివరకు కొద్దిమంది చేతుల్లోనే ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లోకి, ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన లెజెండరీ బ్యానర్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) రంగ ప్రవేశం చేస్తోందనేలా టాక్ వినిపిస్తోంది. నైజాంలో మరో సొంత ఆఫీస్‌ను ప్రారంభించేందుకు అక్కినేని నాగార్జున (King Nagarjuna) ప్లాన్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగార్జున ఇటీవల ఫ్యూచర్ సిటీ (Future City)లో కూడా స్టూడియో విస్తరణ గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి అనుబంధంగా డిస్ట్రిబ్యూషన్ వింగ్‌ను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని కింగ్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, ఆయన ఈ నిర్ణయం వెనుక మరో ఉద్దేశ్యం కూడా ఉందని తెలుస్తోంది. అదేంటంటే..
Also Read- Box Office War: విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు.. షెడ్యూల్ ఖరారు!
నైజాం మార్కెట్‌లో ప్రస్తుతం దిల్ రాజు (SVC), ఏషియన్ సునీల్, మైత్రీ శశి వంటి హేమాహేమీలు డిస్ట్రిబ్యూషన్ పరంగా చక్రం తిప్పుతున్నారు. ఏ సినిమా విడుదల కావాలన్నా, ఏ థియేటర్ దొరకాలన్నా వీరి నిర్ణయమే కీలకంగా మారుతుంది. ఇలాంటి మోనోపలీ వ్యవస్థ వల్ల చిన్న నిర్మాతలు, కొన్నిసార్లు పెద్ద నిర్మాతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఓపెన్ సీక్రెటే. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్‌లో పట్టున్న అన్నపూర్ణ టీమ్, నైజాంలో సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. ఒక కొత్త డిస్ట్రిబ్యూషన్ హౌస్ రావడం వల్ల పోటీ పెరుగుతుంది. దీనివల్ల థియేటర్ల కేటాయింపులో నిర్మాతలు ఎవరి మీదో ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మోనోపలీ వ్యవస్థ పూర్తిగా అంతం కావాలని కోరుకునే నిర్మాతలకు, అన్నపూర్ణ నిర్ణయం ఒక గుడ్ సైన్ అనే చెప్పాలి.
Also Read- Tirumala Temple: ఒక రోజంతా తిరుమల ఆలయం మూసివేత – ఎప్పుడు, ఎందుకో తెలుసా..?
కాకపోతే ఇది అంత అషామాషీ వ్యవహారం కాదు. నైజాంలోని దిగ్గజాల మధ్య సొంతంగా డిస్ట్రిబ్యూషన్ హౌస్ అంటే సాహసమే అయినప్పటికీ, అన్నపూర్ణ సంస్థకు మాత్రం ఏమంత కష్టం కాదు. ఎందుకంటే, దశాబ్దాలుగా సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్, ఇతర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. అలాగే అక్కినేని బ్రాండ్ మీద నిర్మాతలకు ఉన్న నమ్మకం ఒకటయితే, మోనోపలీ వ్యవస్థ వల్ల విసిగిపోయిన మేకర్స్, ఎంతో గౌరవం ఉన్న అన్నపూర్ణ సంస్థ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అలాగే నైజాం వ్యాప్తంగా ఎగ్జిబిటర్లతో అక్కినేని కుటుంబానికి ఉన్న పాత సంబంధాలు ఇప్పుడు కొత్త సంస్థ ఏర్పాటుకు కలిసిరానున్నాయి. మొత్తంగా చూస్తే.. నైజాం గడ్డపై దిల్ రాజు, ఏషియన్ సునీల్, మైత్రీ శశి వంటి ఉద్దండులకు అన్నపూర్ణ స్టూడియోస్ ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి. ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి.. అన్నపూర్ణ ఎంట్రీతో నైజాం బాక్సాఫీస్ లెక్కలు మొత్తం మారిపోవడం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో..
Also Read- Meesaala Pilla Song: ‘మీసాల పిల్ల’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూసేయండిక!