E-Paper
Advertisement

Tata Sierra EV Launch: టాటా సియెర్రా EV లాంచ్ డేట్ ఫిక్స్, మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Tata Sierra EV Launch: టాటా సియెర్రా EV  లాంచ్ డేట్ ఫిక్స్, మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?
Advertisement

Tata Sierra EV Launch Date: ఇండియన్ దిగ్గజ ఆటో మోబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ కు పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి విడుదలైన అన్ని ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. పోటీ కంపెనీలకు ఏమాత్రం అందుకోలేని రీతిలో దూసుకుపోతున్నాయి. అందులో భాంగానే మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయబోతుంది. సియెర్రా పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. 2027 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ అవుతుందని వెల్లడించింది.

న్యూ జెన్ సియెర్రాకు భారీ స్పందన

నవంబర్ 2025 లాంచ్‌కు ముందు న్యూ జెనరేషన్ టాటా సియెర్రా ఇండియన్ ఆటో మార్కెట్ లో సంచలనం సృష్టించింది. ఈ SUV కేవలం 24 గంటల్లోనే 70,000 బుకింగ్‌లను అందుకుంది. బుకింగ్‌లు ఇప్పుడు 1 లక్ష యూనిట్లను దాటాయి. అధిక డిమాండ్ కారణంగా, అనేక నగరాల్లో వెయిటింగ్ పీరియడ్ దాదాపు 6 నుంచి 7 నెలల వరకు పడుతుంది. టాటా ముందుగా ఆటో ఎక్స్‌ పో 2025లో సియెర్రాను ICE, EV వెర్షన్‌లలో అందిస్తున్నట్లు ధృవీకరించింది.

సియెర్రా EV కోసం కీలక డిజైన్ మార్పులు

Advertisement

సియెర్రా EV పెట్రోల్, డీజిల్ వెర్షన్ లాగానే కనిపిస్తుంది. అయితే, EV నిర్దిష్ట స్టైలింగ్ అప్‌ డేట్లను పొందుతుందని భావిస్తున్నారు. వీటిలో క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, రీ డిజైన్ చేసిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు ఉంటాయని భావిస్తున్నారు.  లోపల, ఈ SUV  కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌ వేర్, ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ కోసం కొత్త గ్రాఫిక్స్, EV ఫోకస్డ్ డిస్ ప్లేలను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫేస్‌ లిఫ్టెడ్ టాటా పంచ్ EV తర్వాత ఈ సంవత్సరం Tata.ev లాంచ్‌ లో సియెర్రా EV రెండవదిగా గుర్తింపు తెచ్చుకోనుంది.

సియెర్రా EV బ్యాటరీ, రేంజ్ వివరాలు

సియెర్రా EV దాని పవర్‌ ట్రెయిన్ ఎంపికలను హారియర్ EVతో పంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం, హారియర్ EV 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 65kWh వేరియంట్ ఒకే ఛార్జ్‌ తో 538 కి.మీ రేంజ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇది 235 bhp పవర్, 315 Nm పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద 75kWh బ్యాటరీ ప్యాక్ 390 bhp, 504 Nm టార్క్‌ ను అందిస్తుంది.  టాటా సియెర్రా EV తో డ్యూయల్ మోటార్ సెటప్ లేదంటే ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఎంపికను కూడా అందించే అవకాశం ఉంటుంది. ఇది దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

సియెర్రా EV వేటితో పోటీ పడుతుందంటే?  

Advertisement

టాటా సియెర్రా EV మార్కెట్ లోకి వచ్చిన తర్వాత, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6, MG ZS EV, మారుతి ఇ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, మహీంద్రా XUV 3XO లాంటి మోడళ్లతో పోటీపడుతుంది. బలమైన బ్రాండ్ వ్యాల్యూ, ICE వెర్షన్‌కు భారీ స్పందన వచ్చిన నేపథ్యంలో, సియెర్రా EV FY27లో టాటా మోటార్స్ అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రిక్ లాంచ్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉంది.

Read Also: కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV.. రెండు కార్ల మధ్య తేడాలు ఇవే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×