Nora fatehi:భాషతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ.. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న నోరా ఫతేహి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, అద్భుతమైన నృత్య ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్.. గత కొంతకాలంగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పప్రేమ్ దర్శకత్వంలో రాబోతున్న ‘కేడీ : ది డెవిల్ ‘సినిమాలోని “సర్కే చునార్ తేరీ సర్కే” పాట వివాదాస్పదమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాదాస్పదం కారణంగా ఆమె చిక్కుల్లో పడింది. అయితే దీనిపై విచారణకు హాజరు కావాలి అంటూ నోరా ఫతేహి, సంజయ్ దత్ లకు జాతీయ మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. కానీ నోరా ఫతేహి చేసిన పనికి మహిళ కమిషన్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం . దీంతో ఈమె మళ్ళీ చిక్కుల్లో పడింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి..
అసలు విషయంలోకి వెళ్తే .. ఏప్రిల్ 6వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా.. నోరా ఫతేహి తరఫు న్యాయవాది హాజరు కావడంపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోరాఫతేహి వ్యక్తిగతంగా హాజరు కావాలి అని ఆదేశించింది. ఇకపోతే ఏప్రిల్ 27 వరకు సమయం ఇచ్చింది మహిళా కమిషన్ . ఒకవేళ ఆరోజు కూడా నోరాఫతేహి హాజరు కాకపోతే ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక మరొకవైపు ఈ పాటలో నోరా ఫతేహీతోపాటు నృత్య ప్రదర్శన ఇచ్చిన సంజయ్ దత్ కూడా ఖచ్చితంగా ఏప్రిల్ 8న హాజరుకావాలని కోరింది. మరి సంజయ్ దత్ మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు విచారణకు హాజరవుతారో లేదో తెలియాల్సి ఉంది.
also read:ట్రోల్స్ పై మరోసారి స్పందించిన రేణు దేశాయ్.. వదిలేదే లేదు!
ఇదిలా ఉండగా వివాదంలో ఈ పాట చిక్కుకోవడంతో ఈ పాట రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, నిర్మాతలు ఇప్పటికే మహిళా కమిషన్ కి లిఖితపూర్వక లెటర్ ద్వారా క్షమాపణలు తెలియజేశారు. ఇప్పటికే పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు కూడా స్పష్టం చేశారు.అయితే ఈ సర్కే చునార్ తేరీ సర్కే పాట లిరిక్స్ పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహాత్కర్ మాట్లాడుతూ..” పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉంది. ముఖ్యంగా ఈ పాట లిరిక్స్ అర్థం తెలియదని సాకులు చెప్పడం సరికాదు.. ఇలాంటివి తెరకెక్కించే ముందు కాస్త ఆలోచించాలి” అంటూ ఆమె చిత్ర బృందాన్ని హెచ్చరించింది. అయితే దీనిపై స్పందించిన దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ..” కేవలం వినోదం కాస్తమే చిత్రీకరించిన పాట ఇది. ఎవరిని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు” అంటూ వివరణ ఇచ్చారు.
కేడీ: ది డెవిల్ సినిమా విషయానికి వస్తే.. ధృవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నోరాఫతేహి, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు ఇలాంటి వివాదంలో చిక్కుకుంది.