E-Paper
Advertisement

మారుతి సుజుకి కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 2.6 లక్షల తగ్గింపు!

మారుతి సుజుకి కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 2.6 లక్షల తగ్గింపు!
Advertisement

Maruti Nexa discounts April 2026: ఈ నెలలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నవారికి మారుతి సుజుకి గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన నెక్సా షోరూమ్‌ల ద్వారా అమ్మే పలు పాపులర్ కార్లపై ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. కొన్ని మోడళ్లపై రూ. 2.65 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఏ కార్లపై ఎంత తగ్గింపు ఇస్తుందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ ఇగ్నిస్- రూ. 35,000 తగ్గింపు

నెక్సా తాజా ఆఫర్లలో ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం వరకు పలు కార్లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇగ్నిస్ పై తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ఇది నెక్సా శ్రేణిలో అందుబాటులో ఉన్న చిన్న హ్యాచ్‌ బ్యాక్. ఈ నెలలో ఈ కారుపై సుమారు రూ. 35,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. తక్కువ బడ్జెట్‌ లో మంచి స్టైలింగ్, ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక కానుంది.

⦿ బాలెనో- రూ. 30,000

Advertisement

ఇక బాలెనో విషయానికి వస్తే.. దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ లలో ఒకటి. ఏప్రిల్‌ లో ఈ కారుపై రూ. 30,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్లపై ఎక్కువ తగ్గింపు ఉండగా, CNG వేరియంట్లకు కొద్దిగా తక్కువ డిస్కౌంట్ ఉంది.

⦿ ఫ్రాంక్స్ SUV- రూ. 50,000  

ఈ కారు కూడా ఈ నెలలో కొన్ని ప్రత్యేక ఆఫర్లతో వస్తోంది. ఈ డిస్కౌంట్లు ప్రధానంగా టర్బో పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ మోడళ్లపై రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇతర వేరియంట్లపై ఈసారి ఎలాంటి ఆఫర్లు లేవు.

⦿ జిమ్నీ- రూ. 50,000

Advertisement

ఆఫ్ రోడింగ్‌కు ప్రసిద్ధి చెందిన SUV జిమ్నీ..  అడ్వెంచర్ ప్రియులకు మంచి ఎంపిక. ఏప్రిల్‌ లో ఈ కారుపై రూ. 50,000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఇది అన్ని వేరియంట్లకూ వర్తిస్తుంది.

⦿ XL6- రూ. 45,000

ఫ్యామిలీ కోసం పెద్ద కారు చూస్తున్నవారికి XL6 మంచి ఆప్షన్. ఈ 6-సీటర్ ఎంపీవీపై సుమారు రూ. 45,000 వరకు డిస్కౌంట్ ఉంది. ప్రీమియం ఫీచర్లు, కంఫర్ట్ కలిసిన ఈ కారు సిటీ ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్స్‌ కు అనుకూలంగా ఉంటుంది.

⦿ గ్రాండ్ విటారా- రూ. 2.65 లక్షలు

ఇక గ్రాండ్ విటారా  SUVపై భారీ ఆఫర్లు ప్రటించింది. ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ. 2.65 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లపై కూడా రూ. 75,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా కొన్ని వేరియంట్లకు ఎక్స్ టెండెడ్ వారంటీ కూడా ఇస్తున్నారు.

⦿ ఇన్విక్టో- రూ. 2 లక్షలు

చివరగా ఇన్విక్టో గురించి చెప్పాలంటే, ఇది పెద్ద 7-సీటర్ ఎంపీవీ. ఈ కారుపై ఏప్రిల్‌ లో రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్యామిలీ యూజ్ కోసం స్పేస్, కంఫర్ట్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: భారత్‌ లోకి హమ్మర్ EV ఎంట్రీ.. ధర ఏకంగా రూ. 4.5 కోట్లు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×