E-Paper
Advertisement

Telangana Tourism: తెలంగాణ టూరిజం శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ప్రైవేటు టెండర్లు..?

Telangana Tourism: తెలంగాణ టూరిజం శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ప్రైవేటు టెండర్లు..?
Advertisement

Telangana Tourism: స్వేఛ్చ బ్యూరో: యువత, పర్యాటకుల అభిష్టానికి అనుగుణంగా తెలంగాణ టూరిజం శాఖ హౌజ్ బోట్లుఅందుబాటులోకి తీసుకురాబోతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో రెండు ప్రాంతాల్లో తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో హౌజ్ బోటులో రెండు డబుల్ బెడ్రూంలు ఉంటాయి. ఇది ఆకట్టుకోనుంది. ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

ఒక్కో బోటులో రెండు బెడ్రూంలు

ప్రజలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీకెండ్లతో పాటు సాయంత్రం వేళ్లలో మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదం కోరుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. నీటి పై ప్రవాహం.. కుటుంబంలో సరదాగా గడపడటం కోసం మంచివాతావరణం కోసం వెతుకుతుంటారు. వారి అభిరుచులకు అనుగుణంగా తెలంగాణ పర్యాటకశాఖ దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్ లో హౌజ్ బోట్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఒక్కో బోటులో రెండు డబుల్ బెడ్రూంలు ఉంటాయి. ఇందులో కుటుంబాల సమ్మేతంగా బోట్లలో స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బోట్లు మొత్తం నీళ్లపై ప్రయాణం చేయడం జరుగుతుంది. కుటుంబానికి కావల్సిన మౌలిక సదుపాయాలు, ఆహారానికి సంబంధించిన క్యాంటీన్లు సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఒక్క దుర్గం చెరువులోనే 6 హౌజ్ బోట్లుఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. 6 హౌజ్ బోట్లలో 12 డబుల్ బెడ్రూంలు ఉంటాయి. హుస్సేన్ సాగర్ లో తొలుత రెండు హౌజ్ బోట్లుఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే పర్యాటకులకు సంఖ్య పెరగనుంది.

Advertisement

Also Read: Kothagudem: కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం.. కాంగ్రెస్‌పై సీపీఐ పార్టీ కుస్తీ..!

పీపీపీ మోడల్ నిర్వహణ

హౌజ్ బోట్లనిర్వహణకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు సమాచారం. వాటిని ప్రభుత్వం నిర్వహిస్తే ఎలా ఉంటుందనేదానిపైనా టూరిజంశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటుకు అప్పగిస్తే వారి నుంచి ఎలా శాఖకు ఆదాయం రాబోట్టు అనేది పరిశీలన చేస్తున్నారు. పీపీపీ మోడల్ నిర్వహణ ఎలా ఉంటుందనే అంశాలను సైతం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. గోవాల పడవ తయారీ యూనిట్లు ఉండగా అక్కడ తయారీ చేయించి తెలంగాణకు తీసుకురావాలా? లేకుంటే ఇక్కడ తయారు చేసేలా ఏదైన కంపెనీని ఆహ్వానించాలా? ప్రైవేటు వారికే నిర్వహణ బాధ్యత అప్పగిస్తే వారు బోట్లను తయారు చేసుకుంటారనే దానిపైనా సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఇతర రాష్ట్రాల్లో పర్యాటక శాఖలు

Advertisement

రాష్ట్రంలోని 19 జిల్లాల్లో నదులు, సరస్సుల్లో 99 బోట్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. వీటికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని, దానిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా బోట్లఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పర్యటకశాఖలు అనుసరిస్తున్న విధానాలు, నూతనంగా బోట్లఏర్పాట్లపై దృష్టిసారించింది. అందులో భాగంగానే నూతనంగా 9 బోట్లకు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. పరిగి,జొన్నలబొగూడ, వార్దవెల్లి, రాయిగిరి, పర్ణశాల, రాయిగిరి, భద్రాచలం, బోరంచ, నిజాంసాగర్ లో బోట్లకు డిమాండ్ ఉందని మంజూరు ఇవ్వాలని పర్యాటకశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏదిఏమైన పర్యటకశాఖ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో పర్యాటకశాఖ బలోపేతం కానుంది. మరోవైపు రాష్ట్రానికి దేశ, విదేశీ పర్యాటకులసంఖ్య పెరగడంతో పాటు ఆదాయం సైతం పెరగనుంది.

Also Read: Chinese Oils: ఈ చైనా నూనెలు వాడారంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగేస్తుందట

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×